ఆ మధ్య ఓ ఆడియో వేడుకలో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయినప్పటికీ ఆయనేమీ తగ్గట్లేదు. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో అనేక సంచలన వ్యాఖ్యలు చేశారాయన. అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశం అవుతున్నాయి. దీంతో పాటుగా ఇండస్ట్రీ గురించి అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు చలపతిరావు. ఎన్టీఆర్ జానెడుంటాడని.. రావణాసురుడి టైపు పాత్రలు చేయలేడని.. ఎన్టీఆర్ కు నట వారసులు ఎవ్వరూ లేరని.. ఇలా చాలా వ్యాఖ్యానాలే చేశారాయన.
దీంతో పాటుగా టాలీవుడ్ హీరోల గురించి.. ‘బాహుబలి’ సినిమా గురించి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి హీరోలు ఎవరో ఏంటో ఎవరికీ గుర్తుండదని.. జనాల్లో వాళ్లు రిజిస్టర్ కాలేరని అన్నారు చలపతిరావు. ఇప్పటి హీరోల్ని జనాలు చూసి ఛీకొడుతున్నారని ఆయనన్నారు. గడ్డాలు.. మీసాలు పెంచుకుని.. చిరిగిన జీన్స్ ప్యాంట్లు వేసుకుని కనిపిస్తున్నారని.. ఏమైనా అంటే ఫ్యాషన్ అంటున్నారని.. అలాంటి వాళ్లను చూస్తే ప్రేక్షకులకు అసహ్యం పుడుతోందని అన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి వాళ్లను చూసి వాళ్ల లాగే ఉండేందుకు ప్రయత్నించేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదని.. హీరోల అవతారం చూసి ‘చెప్పుతో కొడతా’ అని ప్రేక్షకులు అనే పరిస్థితి వచ్చిందని అన్నారు చలపతిరావు. మరోవైపు ‘బాహుబలి’ సినిమా గురించి ఆయన స్పందిస్తూ.. రాజమౌళికి ప్రేక్షకుల్ని థియేటర్లకు ఎలా రప్పించాలో తెలుసని.. మీడియా వాళ్లను పట్టుకుని.. ఏదో ఒకటి చేసి జనాల్ని థియేటర్లకు రప్పించిన మార్కెటింగ్ నిపుణుడు రాజమౌళి అని వ్యాఖ్యానించారాయన.