ఫోటో స్టొరీ: హిమాలయాల అంచుల దాకా..

Update: 2019-02-28 09:49 GMT
షార్ట్ ఫిలిమ్స్ చూసేవారికి చాందిని చౌదరి పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే మాత్రం చాందినికి పెద్దగా పాపులారిటీ రాలేదు.  'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చాందిని చాలా సినిమాలలోనే నటించింది.  లాస్ట్ ఇయర్ 'హౌరా బ్రిడ్జ్'.. 'మను' సినిమాలలో నటించింది కానీ అవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.

ఈ సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ జెనరేషన్ భామల్లాగే చాందిని కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా అప్డేట్లు పోస్ట్ చేస్తూ నెటిజనులతో టచ్ లో ఉంటుంది.  ఆ ట్రెండ్ నే కంటిన్యూ చేస్తూ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా రెండు ఫోటోలు షేర్ చేసింది.  హిమాలయాలకు ట్రెక్కింగ్ కు వెళ్ళినట్టుంది.. అందుకే "ఎక్కడం పూర్తయిన తర్వాత ఆ సంతోషమే వేరు" అని క్యాప్షన్ ఇచ్చింది.  తెల్లటి మంచుకొండల నేపథ్యంలో తీసుకున్న చాందిని ఫోటో అదిరిపోయింది.  ఫుల్ స్లీవ్స్  బ్లాక్ టీ షర్ట్ -  కార్గో ప్యాంట్ తో యమా స్టైలిష్ గా ఉంది. నవ్వు కూడా సూపరే.

కాకపోతే ఈ ఫోటోలో హైలైట్ చాందిని కాదు.  ఫోటోగ్రాఫర్. ఎవరనుకున్నారు?  'ఫలక్ నుమా దాస్' విష్వక్ సేన్.   అదే విషయాన్ని తన క్యాప్షన్ లో 'పిక్ కర్టెసీ: విష్వక్ సేన్'  అని మెన్షన్ చేసింది లెండి. ఇక్కడ ఓల్డ్ సిటీ బూతులతో ట్రైలర్ మంట పెట్టి అక్కడ చల్లగా హిమాలయాలలో కూల్ అవుతూ చాందిని ఫోటోలు తీస్తున్నాడా గురుడు.. ఏంటో సంగతి!
Tags:    

Similar News