'ఆచార్య'పై చాలా ప్రభావం చూపనున్న కరోనా

Update: 2020-07-22 13:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ ను కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి సినిమాను వెంటనే విడుదల చేయాలని భావించారు. సైరా చిత్రం కోసం చాలా గ్యాప్‌ తీసుకున్న చిరంజీవి ఆ గ్యాప్‌ ఫిల్‌ చేసే ఉద్దేశ్యంతో ఈ ఏడాది రెండు సినిమాలను చేయాలనుకున్నాడు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఒక్కటి అంటే ఒక్కటి కూడా విడుదల చేయాలేని పరిస్థితి. ఆచార్య చిత్రాన్ని ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

దర్శకుడు కొరటాల శివ తదుపరి చిత్రం కోసం ఆచార్యను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. సెప్టెంబర్‌ నుండి షూటింగ్‌ కు వెళ్లబోతున్నారు. అందుకు సంబంధించిన ఒక భారీ సెట్టింగ్‌ ను వేయిస్తున్నారు. ఆ సెట్‌ లోనే ఎక్కువ శాతం షూటింగ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ కు బయట ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా దర్శకుడు సెట్స్‌ లోనే సినిమాను పూర్తి చేసేందుకు స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేశాడు. అలాగే చరణ్‌ పాత్ర విషయంలో కూడా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది.

మొదట అనుకున్న ప్రకారం కాకుండా ఈ చిత్రంలో చరణ్‌ పాత్రను తగ్గించారట. స్క్రీన్‌ ప్రజెన్స్‌ దాదాపుగా సగానికి తగ్గించినట్లుగా తెలుస్తోంది. అలాగే చరణ్‌ కు జోడీగా కనిపించే హీరోయిన్‌ విషయంలో కూడా మార్పులు చేయబోతున్నారట. మొత్తానికి కరోనా కారణంగా ఇన్నాళ్లు షూటింగ్‌ ఆగిన కారణంగా సినిమాలో పలు మార్పులు చేర్పులు అయితే చేయాలని నిర్ణయించారట. పలు చిన్న సినిమాలకు కరోనా దెబ్బ గట్టిగా పడినది. మెగాస్టార్‌ సినిమాకు కూడా కరోనా ప్రభావం కనిపించనుంది.
Tags:    

Similar News