2022 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` కి మెట్రో నగరాల్లో ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత రామ్ చరణ్..ఎన్టీఆర్..రాజమౌళి అక్కడ తిష్ట వేసి సినిమాని హిందీలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే కపిల్ శర్మ టీవీ షోకు హాజరై `ఆర్ ఆర్ ఆర్` కి కావాల్సినంత ప్రచారం కల్పించారు. హిందీ మార్కెట్ ఇద్దరి హీరోలకు ప్రధానం కాబట్టి అక్కడి ప్రచారాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు.అయితే తారక్ ని మించి చరణ్ అక్కడ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతల్ని మరింత వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. హిందీ `బిగ్ బాస్ -15` సెట్ ని తాజాగా రామ్ చరణ్ సదర్శించారు.
బిగ్ బాస్ షూటింగ్ జరుగుతోన్న సమయంలో చరణ్ నిర్వాహకులతో మాట మంతీ సాగించినట్లు కనిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ 15 కొత్త ఎపిసోడ్ లో చరణ్ సహా తారక్ - రాజమౌళి కనిపించే వీలుంది. ఆ వేదికపై ఆర్ ఆర్ ఆర్ ప్రచారం కానిచ్చేస్తారు. చరణ్ ఇప్పటికే బాలీవుడ్ లో `జంజీర్` చిత్రంతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఘనమైన ఎంట్రీ విషయంలో చరణ్ కోరిక నెర వేరలేదు. ఇప్పుడా విజయం `ఆర్.ఆర్.ఆర్`తో సాధ్యమేనని భావిస్తున్నాడు. పాన్ ఇండియా కేటగిరిలో అత్యంత భారీగా రిలీజ్ అవుతోన్న సినిమా కాబట్టి హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టి సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే బెస్ట్ రీలాంచ్ చరణ్ కి దక్కినట్లే.
చరణ్ అనుకున్నది జరిగితే గనుక తదుపరి బాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాస్ బాహుబలితో హిందీలో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తరహాలోనే చరణ్ కూడా ఉత్తరాదిన వెలిగిపోవాలని ప్లాన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్ కమిట్ మెంట్లు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న దర్శకులతోనే జరుగుతున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరితోనూ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. జెర్సీని బాలీవుడ్ లో గౌతమ్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.