రూమ‌ర్స్ పై ఛార్మీ స్ట్రాంగ్ రిప్లై!

Update: 2022-09-08 11:45 GMT
వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి చేసిన మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ మూవీ 'లైగ‌ర్‌'. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి ఛార్మీ, పూరి జ‌గ‌న్నాథ్ పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై అత్య‌తం భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. రిలీజ్ కు ముందు బైకాట్ వివాదం త‌లెత్తినా దాన్ని అధిగ‌మించి ఈ మూవీ భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ మూవీ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి త‌న‌కు బాలీవుడ్ లోనూ మంచి పేరు తో పాటు క్రేజ్ ని తెచ్చిపెడుతుందని భారీ హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఐదు భాష‌ల్లో భారీ స్థాయిలో ఆగ‌స్టు 25న విడుద‌లైన 'లైగ‌ర్‌' ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌డంలో దారుణంగా విఫ‌ల‌మైంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు భారీ డిజాస్ట‌ర్ ని అందించింది. ఈ నేప‌థ్యంలో నెట్టింట ఛార్మీ, పూరీల‌పై నెటిజ‌న్ లు కామెంట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో సోష‌ల్ మీడియాకు కొంత కాలం బ్రేకిస్తున్నాన‌ని, మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయి రెట్టించిన వేగంతో వ‌స్తామ‌ని ప్ర‌క‌టించి ఛార్మీ సోష‌ల్ మీడియాకు దూరంగా వుంది. అయితే రీసెంట్ గా 'లైగ‌ర్‌' డిజాస్ట‌ర్ కావ‌డంతో ఆ న‌ష్టాల‌ని భ‌ర్తి చేయ‌లేక పూరి జ‌గ‌న్నాథ్ స‌త‌మ‌త‌మ‌వుతున్నారని, అంతే కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేస్తున్న 'జ‌న‌గ‌ణమ‌న‌' ప్రాజెక్ట్ ని మ‌ధ్య‌లోనే ఆపేశార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి.

అంతే కాకుండా 'లైగ‌ర్‌' న‌ష్టాల్లో వున్న పూరి ముంబై ఆఫీస్ రెంట్ క‌ట్ట‌లేక ఖాలీ చేసి త‌న మ‌కాంని హైద‌రాబాద్ కు మారుస్తున్నాడంటూ మ‌రో వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

అంతే కాకుండా 'లైగ‌ర్' డిజాస్ట‌ర్ కార‌ణంగా పూరి, ఛార్మీల మ‌ధ్య దూరం పెరిగింద‌ని, పూరి జ‌గ‌న్నాథ్ చాలా ఒత్తిడికి గురవుతున్నార‌ని. అంతే కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రారంభించిన 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' ప్రాజెక్ట్ కోసం ఇప్ప‌టికే 10 నుంచి 12 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని, అది ఆగిపోవ‌డంతో పూరి క‌నెక్ట్స్ నుంచి ఛార్మీ విడిపోయిందంటూ ర‌క ర‌కాల రూమ‌ర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఛార్మీ గురువారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది.  

'రూమ‌ర్స్ ..రూమ‌ర్స్ రూమ‌ర్స్‌.. అన్ని రూమ‌ర్స్ ఫేక్ !. కేవ‌లం పూరి క‌నెక్ట్స్ పై దృష్టి సారిస్తున్నాను. అయితే పుకార్ల‌కు రెస్ట్ ఇన్ పీస్‌!!' అంటూ రూమ‌ర్స్ పై ఛార్మీ త‌న‌దైన స్టైల్లో రిప్లై ఇచ్చింది. అయితే ఛార్మీ 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' ఆగిపోయింద‌న్న వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిందా?  లేక తాను పూరితో విడిపోతున్నాన‌ని, పూరి క‌నెక్ట్స్ నుంచి విడిపోతున్నాన‌ని వ‌స్తున్న వాటిపై స్పందించిందా?.. లేక 'లైగ‌ర్‌' ఫ్లాప్ కార‌ణంగా పూరి ముంబై ఆఫీస్ ఖాలీ చేస్తున్నాడ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై రిప్లై ఇచ్చిందా? అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త రావాల్సి వుందని ఇన్ సైడ్ టాక్‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News