నాక్కొంచెం పిచ్చుంది. కానీ దానికో లెక్కుంది అని పవన్‌కల్యాణ్ చెప్పాడు. అదే డైలాగ్‌ని రిపీట్ చేసింది జ్యోతిలక్ష్మి ఛార్మి. నాక్కొంచెం పిచ్చి ఉంది. అమ్మా నాన్నలు తప్ప వేరెవరూ తట్టుకోలేరు. అది తట్టుకునే చెలికాడు దొరికితే బావుణ్ణు అని ఎదురు చూస్తున్నా.. అని చెప్పింది ఛార్మి. అయితే ఇదే పిచ్చి ఈ అమ్మడిని ఇటీవలి కాలంలో ఇరకాటంలో పెట్టేసింది కదా!
భవిష్యత్ నిర్మాతగా ఎదగబోయి అనవసర ప్రచారంతో బ్యాడ్ అయిపోయింది. ఇదే విషయాన్ని అడిగితే.. అవునని కాదని అనలేదు. అంతేనా మునుముందు సినిమాలు నిర్మించే ఆలోచనైతే ఉంది. కాకపోతే గ్రౌండ్‌వర్క్ చేయాలని చెప్పింది. కేవలం తాను నటించే సినిమాలే కాదు బైటి హీరోలతోనూ సినిమాలు నిర్మించాలనుందని చెప్పింది. ఓ స్టార్ హీరో సినిమాలో భాగస్వామి అవుతున్నారట కదా? అన్న ప్రశ్నకు అదంతా మీడియా ప్రచారం. నాకు తెలియకుండానే ఆ వార్త వచ్చింది. నేను అననిదానికిి నేనెలా సమాధానం చెప్పగలను.. అని ఎదురు ప్రశ్నించింది.
ఛార్మింగ్ బ్యూటీ మాటల్ని బట్టి భవిష్యత్‌పై చాలా ప్రణాళికలే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. నిర్మాత అవ్వాలి. హీరోయిన్‌గా వెలగాలి. పెద్ద స్టాటస్‌కి ఎదిగి చూపించాలి. అలాగే జనాల దుష్ప్రచారినిక సరైన సమాధానం చెప్పాలి అన్న కసి పెరిగినట్టే కనిపిస్తోంది.