ఆ హోట‌ల్‌ ని చూసిన చెఫ్‌ ల‌కు క‌న్నీళ్లు

Update: 2018-09-13 05:01 GMT
ఇన్నాళ్లు ర‌క‌ర‌కాల కాన్సెప్టుల‌తో సినిమాలొచ్చాయి. కానీ పూర్తి స్థాయి హోట‌ల్స్ బ్యాక్‌ డ్రాప్‌ సినిమాలైతే తెలుగులో ఒక్క‌టీ రాలేదు. ఏవో కొన్ని సీన్ల‌లో హోట‌ల్‌ ని చూపిస్తారు త‌ప్ప‌, పూర్తిగా హోట‌ల్ క‌థ‌తోనే తెలుగులో రానేలేదు. ఆ లోటు పూడ్చేందుకు దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ జంటగా న‌టించిన `జనతా హోటల్` వ‌స్తోందంటూ నిర్మాత‌లు ఊద‌ర‌గొడుతున్నారు. మళయాలంలో ఘనవిజయం సాధించి అంత‌ర్జాతీయ ఫిలింఫెస్టివల్‌ కి ఎంపికైన `ఉస్తాద్ హోటల్`ను తెలుగులో `జనతా హోటల్` పేరుతో  రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ లో కొంద‌రు చెఫ్‌ల‌కు ప్ర‌ముఖ హోట‌ల్ చైన్ గ్రూప్ అధినేత - తెలంగాణ హోట‌ల్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు నాగ‌రాజు సార‌థ్యంలో ప్రివ్యూని ప్ర‌ద‌ర్శించారు. ఈ ప్రివ్యూ వీక్షించిన‌ హోట‌ల్ మేనేజ్‌ మెంట్ విద్యార్థులు స‌హా ప్రొఫెష‌న‌ల్ చెఫ్‌ లు ఎంతో ఉద్వేగానికి లోన‌వ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. జ‌న‌తా హోట‌ల్ ప్రివ్యూ వీక్షించిన హోట‌ల్ చెఫ్స్ ఎంతో ఉద్వేగంగా సినిమాపై త‌మ అభిప్రాయాల్ని తెలిపారు. మంచి భోజ‌నం మ‌న‌సుతో వండి వ‌డ్డిస్తేనే రుచిక‌రంగా ఉంటుంద‌న్న సందేశాన్ని ఈ సినిమా ఇచ్చింద‌ని పొగిడేశారు. అంతేకాదు.. ఈ సినిమా చూసిన తెలంగాణ హోట‌ల్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు నాగ‌రాజు త‌న జ‌వితాన్ని రీకాల్ చేసుకున్నారు. ఇందులో స‌గ‌భాగం నా లైఫ్‌ తో ముడిప‌డిన స‌న్నివేశాలే. హోట‌ళ్ల ప‌రిశుభ్ర‌త‌ - రుచిక‌ర‌మైన వంట అన్న పాయింట్‌ ని రియాలిటీలోనూ హోట‌ల్ ఇండ‌స్ట్రీస్‌ లో మేం అనుస‌రించాం. త‌క్కువ ధ‌ర‌కు పేద‌ల‌కు భోజ‌నం అందించాల‌న్న కాన్సెప్టుతో తొంద‌ర్లోనే ఇదే సినిమా టైటిల్ (జ‌న‌తా హోట‌ల్‌) తో హోటల్స్‌ ని ప్రారంభించాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. ఇక చిత్ర నిర్మాత మాట్లాడుతూ `జ‌న‌తా హోట‌ల్` అన్న టైటిల్ పెట్టాల‌ని సూచించార‌ని తెలిపారు.

ఈ సినిమా వీక్షిస్తే హైద‌రాబాద్ హోట‌ల్స్‌ లో - హాస్ట‌ల్స్‌ లో తిండి తినేవారికి ఓ సంగ‌తి స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. న‌గ‌రం ఆద్యంతం ఎన్ని హోట‌ళ్లు ఉన్నా ఇంకా స‌రైన రుచి దొరక్క జ‌నం ఎందుకు వెతుక్కోవాల్సొస్తుందో అవ‌గ‌తం అవుతుంది. ఇక్క‌డ హోట‌ల్ వాళ్లు - హాస్ట‌ర్ ఓన‌ర్లు తిండిని క‌మ‌ర్షియ‌ల్ దృష్టితో వ‌డ్డిస్తారు త‌ప్ప‌ - మ‌న‌సుతో వ‌డ్డించ‌రని ఇట్టే అర్థ‌మైపోతుంది.
Tags:    

Similar News