ప్రభాస్ ప్రాజెక్ట్ కోసం కెమికల్ ఇంజినీర్స్ కావలెను..!

Update: 2022-11-13 03:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ''ప్రాజెక్ట్ K''. ఇది ఇండియాలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా నిలవనుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీ దత్ అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

"ప్రాజెక్ట్ K" అనేది సైన్స్ ఫిక్షన్ అండ్ సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందే సూపర్ హీరో మూవీ అని ప్రచారం జరుగుతోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో విజువల్ వండర్ గా తీర్చిదిద్దనున్నారు. అయితే మేకర్స్ ఇప్పుడు ఔత్సాహికుల టెక్నిషియన్స్ కు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది.

'ప్రాజెక్ట్ - కె' సినిమా కోసం కెమికల్ ఇంజనీర్లు - స్పెషల్ ఎఫెక్ట్స్ ఔత్సాహికులు లేదా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఇష్టపడే వారి కోసం వెతుకుతున్నామని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. #ProjectK బృందానికి సహాయం చేయడానికి ఇక్కడ మీకు అవకాశం ఉంది. మీ ప్రొఫైల్స్ లేదా మీరు చేసిన ఏదైనా కూల్ ఎక్స్పరిమెంట్స్ ను మాకు పంపండి.. త్వరపడండి! అంటూ మెయిల్ ఐడీని ఇచ్చారు.

గతంలో ప్రాజెక్ట్-K కోసం మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి కొందరు ఔత్సాహికులను ఎంపిక చేసుకున్నారు. అలానే టెక్నికల్ విభాగంలో వర్క్ చేయటానికి సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు కెమికల్ ఇంజనీర్లు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ చేసేవారి కోసం ప్రకటన ఇచ్చారు. మరి ప్రభాస్ చిత్రానికి పని చేసే ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి.

"ప్రాజెక్ట్-K" సినిమాలో ప్రభాస్ ఒక సూపర్ హీరోగా కనిపిస్తారని డార్లింగ్ బర్త్ డే పోస్టర్ ని బట్టి తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరియు 'లోఫర్' బ్యూటీ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మిక్కీ జె. మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న "ప్రాజెక్ట్ K" చిత్రాన్ని 2024 దసరా సీజన్ లో లేదా 2025 సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు విదేశీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News