ఒక భాషలో హిట్టయిన సినిమా ఇంకో భాషలో హిట్ కావాలనే రూలేమీ లేదు. శంకర్ లాంటి దర్శకుడు '3 ఇడియట్స్' లాంటి బ్లాక్ బస్టర్ ను రీమేక్ చేస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డబ్బింగ్ సినిమాల పరిస్థితి కూడా అంతే. కొంతమందేమో దీనికి కారణం నేటివిటీ అంటారు. మరలాంటప్పుడు యూనివర్సల్ పాయింట్ ఉంటే తప్ప జనాలకు నచ్చదు. తాజాగా కార్తి సినిమాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
తమిళంలో 'కడైకుట్టి సింగం' పేరుతో తెరకెక్కిన కార్తి సినిమాను తెలుగులో 'చినబాబు' పేరుతో ఒకేసారి రిలీజ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ - రివ్యూస్ బాగానే ఉన్నాయి గానీ తెలుగులో మాత్రం కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయట. ఫ్రాంక్ గా చెప్పుకుంటే తెలుగులో సినిమా ఫట్టే అంటున్నారు. తమిళ వాసనలు మరీ ఎక్కువగా ఉండడమే తెలుగులో విజయావకాశాలను దెబ్బతీసిందని అంటున్నారు. కానీ తమిళంలో మాత్రం సినిమా సుపర్ హిట్ దిశగా దూసుకుపోతుందట.
మొదటి వారంలోనే 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళతో హిట్ గా నిలిచిందట. బీ - సి సెంటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారట. రెండోవారంలో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయని సమాచారం. దీంతో ఫుల్ రన్ లో ఇది మంచి లాభాలను తీసుకొస్తుందని బయ్యర్లు హ్యాపీగా ఉన్నారట.