మొదటి నుంచి కూడా శర్వానంద్ విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. బలమైన కథ మాత్రమే ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెట్టగలదు .. సినిమాను థియేటర్లలో ఉంచగలదు అని నమ్మే వ్యక్తి ఆయన. అలాంటి శర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన 'శ్రీకారం' మహాశివరాత్రి కానుకగా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు రానుంది. మిక్కీ జె.మేయర్ అందించిన పాటలు ఇప్పటికే జనంలోకి దూసుకుపోయాయి. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథపై అందరిలోనూ ఆసక్తి ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, నిన్నరాత్రి 'ఖమ్మం'లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ .. "ఖమ్మం .. పోరాటాల ఖిల్లా .. ఇక్కడి ప్రజలు ఎంతగా ప్రేమిస్తారు .. ఎంతగా ఆదరిస్తారు అనేది నాకు అనుభవపూర్వకంగా తెలుసు. మీ ప్రేమానురాగాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదనే విషయం నాకు అర్థమైంది. మిమ్మల్ని ఈ విధంగా కలవడం అనుకోకుండా నాకు తారసపడిన గొప్ప అవకాశం. 'ఆచార్య' సినిమా షూటింగు కోసం నేను ఖమ్మంలో ఉన్నాను. నేను ముఖ్య అతిథిగా రావడం కోసం ఈ వేడుకను ఇక్కడ ఏర్పాటు చేశారు. నేను వస్తే నా అభిమానుల ఆశీస్సులు వాళ్లకి లభిస్తాయని గట్టిగా నమ్మారు. వాళ్ల నమ్మకం నిజమైందనే విషయం మిమ్మలందరినీ చూస్తుంటే అర్థమవుతోంది.
శర్వానంద్ చిన్నప్పటి నుంచి చరణ్ స్నేహితుడు .. మా ఇంట్లోనే ఎక్కువగా పెరిగాడు. తను నాకు మరో చరణ్ లాంటివాడు. శర్వానంద్ ఎప్పుడూ కూడా నటన పట్ల మక్కువ ఉన్నట్టుగా చెప్పలేదు. కానీ ఒకసారి నాతో కలిసి థమ్స్ అప్ యాడ్ లో కనిపించాడు .. చాలా చక్కగా చేశాడు. అతను సినిమా .. సినిమాకి పరిణతిని సాధిస్తూ .. సక్సెస్ లను అందుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చాడు. ఈ సినిమా కోసం మంచి కథను ఎంచుకున్నారు .. వ్యవసాయ విలువలను చాటుతూ యువతకు మంచి మెసేజ్ ఇస్తున్నారు. రైతు కొడుకు నేను రైతునే అవుతానని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి .. రైతే రాజు అని నిరూపించబడే రోజు రావాలి. ఆ రోజు తప్పకుండా వస్తుందనే ఆశ నాకు ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.