'టాలీవుడ్ పెద్ద దిక్కు' పై చిరు మ‌న‌సులో ఉద్ధేశం?

Update: 2023-01-12 04:08 GMT
2022 ఆద్యంతం టాలీవుడ్ పెద్ద దిక్కు అనే టాపిక్ అతిపెద్ద ర‌చ్చ‌యింది. దీనిపై వ‌రుస డిబేట్లు న‌డిచాయి. నువ్వా నేనా అంటూ కొంద‌రు ప్ర‌ముఖులు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ్డారు. 'టాలీవుడ్ పెద్ద' స్థానం కోసం చాలా మంది పాకులాడారు. ఓ వెలుగు వెలిగిపోవాల‌ని క‌లలు గ‌న్నారు. కానీ ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రో తేల‌నేలేదు. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి వెళ్లిపోయాక ఇక ఇండ‌స్ట్రీ దిక్కులేనిద‌య్యింద‌న్న చ‌ర్చా సాగింది. కానీ టాలీవుడ్ క‌ష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ఆపాత్ర దానాలిచ్చేందుకు ముందుకొచ్చారు చిరంజీవి. స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు అంటే ఏమిటో అంద‌రికీ ప్రాక్టిక‌ల్ గా చూపించారు. అంతేకాదు పెద్ద దిక్కు వ్య‌వ‌హారంపై త‌న వెర్ష‌న్ ని సూటిగా చెప్పాశారు. అస‌లు ఇండ‌స్ట్రీ పెద్ద అంటే ఇండ‌స్ట్రీని అడ్డు పెట్టుకునేవాడు కాదు అని ఇండ‌స్ట్రీకి భుజం కాసేవాడ‌ని అర్థం వ‌చ్చేట్టు మెగాస్టార్ చిరంజీవి ఇంత‌కుముందే చాలా స్ప‌ష్టంగా మాట్లాడారు. ఎన్నో గుప్త‌దానాలు మెగా సాయాలు చేసి కూడా ఆయ‌న గుంబ‌న‌గానే ఉండిపోయారు.

అంతేకాదు క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి యుద్ధ ప్రాతిపాదిక‌న సినీకార్మికులంద‌రినీ కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. 24 శాఖ‌ల కార్మికుల‌కు క‌రోనా  క‌ష్టంలో బియ్యం ఇత‌ర‌ నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేశారు. ఇరు రాష్ట్రాల‌ ముఖ్య‌మంత్రుల నిధుల‌కు విరాళాల్ని పంపారు. డైరెక్టుగా క‌ష్టాల్లో ఉన్న ఆర్టిస్టులంద‌రికీ చెక్కుల్ని పంపిణీ చేసారు.  నేను క‌ష్టంలో ఉన్నాను అంటే వెంట‌నే అంద‌రికీ ల‌క్ష‌ల్లో విరాళాలు అంద‌జేసారు. త‌న‌వ‌ద్ద ముందే రెడీ చేసిన చెక్కులు విరాళాలు ఉన్నాయ‌ని వాటిని క‌ష్టంలో ఉన్న ప‌రిశ్ర‌మ ఆర్టిస్టులు కార్మికులు అందుకోవ‌చ్చ‌ని బ‌హిరంగంగానే చెప్పారు చిరంజీవి. బ‌హుశా ఏ సినీఇండ‌స్ట్రీలోను ఇలాంటి గ‌ట్స్ చూపించిన మ‌రో స్టార్ హీరో లేనే లేరు.

కోవిడ్ 19 సెకండ్ వేవ్ విల‌యంలో ఎంద‌రో అభిమానులు ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడారు. డైరెక్టుగా ఆస్ప‌త్రి పెద్ద‌ల‌తో మాట్లాడి వారికి వెంట‌నే వైద్యం అందేలా చేశారు. క‌రోనా క్రైసిస్ లో ఆక్సిజ‌న్ అంద‌క మ‌ర‌ణించే వారి కోసం సొంత డ‌బ్బు 30 కోట్ల మేర ఖ‌ర్చు చేసి విదేశాల నుంచి ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు ఇత‌ర సెట‌ప్ ఎక్విప్ మెంట్ ని ర‌ప్పించి ఇరు రాష్ట్రాల్లో జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లో అందుబాటులో ఉంచ‌డంతో అవి చాలా మంది ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడాయి. వీట‌న్నిటికీ చిరు ఏనాడూ ప్ర‌చారం కోరుకోలేదు. కొన్ని ప్ర‌త్య‌ర్థి మీడియాలు కూడా కావాల‌ని కుట్ర‌తో ప్ర‌చారం చేయ‌నేలేద‌న్న చ‌ర్చ కూడా సాగింది.

మ‌రోవైపు త‌ల‌సేమియా రుగ్మ‌త‌తో ర‌క్తం స‌రైన స‌మ‌యంలో అంద‌క చ‌నిపోయే స‌న్నివేశం ఎదురైంది. చాలా మంది అభాగ్యుల‌కు క‌రోనా లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. అలాంటి స‌మ‌యంలో త‌న అభిమానులంద‌రినీ అలెర్ట్ చేసి ర‌క్త‌దానాలు విరివిగా చేయించారు. తాను త‌న సోద‌రులు కూడా ర‌క్త‌దానం చేసి త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేసారు.

ఆయ‌న ఎన్ని చేసినా.. 'ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి' అంటే ఇప్ప‌టికీ అంగీక‌రించేందుకు మ‌న‌స్క‌రించ‌ని కొంద‌రు పెద్ద‌లు ఉన్నారు. టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో ఎన్నిక‌లొచ్చిన‌ప్పుడు హ‌డావుడి చేసి త‌ర్వాత చ‌ప్పున చ‌ల్లారిపోయే పెద్ద మ‌నుషుల‌కు ఏమాత్రం కొద‌వేమీ లేదు.

తాజా ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ పెద్ద‌గా మిమ్మ‌ల‌ని ఉండ‌మ‌ని కోరితే ..? అంటూ ఒక టీవీ యాంక‌ర్ చిరంజీవిని ప్ర‌శ్నించారు. దానికి చిరంజీవి ఎంతో విన‌మ్రంగా త‌న‌దైన శైలిలో జ‌వాబిచ్చారు. ''బ‌హుశా కీర్తి వ‌ద్దు.. దానికోసం కాపు కాసేవాడిని కాను! ప‌రిశ్ర‌మ‌కు భుజం కాసే అవ‌కాశం వ‌స్తే చాలు... అదే చేస్తాను.. అది చాలు'' అని అన్నారు. త‌న ఒదిగి ఉండే స్వ‌భావాన్ని త‌న సేవాగుణాన్ని మ‌రోమారు ఆయ‌న చాటుకున్న తీరు అంద‌రి హృద‌యాల‌ను తాకింది. చిరు న‌టించిన‌ 'వాల్తేరు వీర‌య్య' ఈ శుక్ర‌వారం (13 జ‌న‌వ‌రి) ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News