'ఆచార్య' గుణపాఠంతో దిద్దుబాటు చ‌ర్య‌లు?

Update: 2022-05-10 03:14 GMT
పాన్ ఇండియా సినిమాల ప్ర‌భావం అంతా ఇంతా కాదు. ప్రేక్ష‌కుల మైండ్ ని సెట్ చేస్తున్న‌వే ఇవి. ఇంత‌కుముందులా ఏదో ఒక సినిమాని చూసేందుకు థియేట‌ర్ కి వెళ్లే ప‌రిస్థితి లేదు. సెల‌క్టివ్ గా వెళ్లేందుకు సినిమా న‌చ్చితే రిపీటెడ్ గా వెళ్లేందుకు జ‌నం వెన‌కాడ‌ర‌ని ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 ఇటీవ‌ల నిరూపించాయి.

ఇలాంటి సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు రొటీన్ కంటెంట్ సినిమా విడుద‌లైతే అది ప‌క్కాగా ఖ‌తం అని కూడా ప్రూవ్ అయ్యింది. `ఆచార్య` కానీ `హీరో పంతి` కానీ దారుణంగా ఫెయిల‌వ్వ‌డానికి కార‌ణం మారిన ఆడియెన్ మైండ్ సెట్ అని కూడా విశ్లేషించాలి. ఇంత‌కుముందులా ఏదో ఒక‌టి చూపించేస్తే లేదా పాత మ‌సాలా దినుసులు చింత‌పండునే రిపీటెడ్ గా ఉప‌యోగిస్తామంటే అటువైపు చూసే ప‌రిస్థితిలో లేరు.

క‌థ‌ల ఎంపిక విష‌యంలో ఇప్పుడు స్టార్ల‌కు చినిగిపోతోంది. తేడాలొస్తే ఇక అంతే సంగ‌తి. మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారికే ఇప్పుడు గొప్ప‌ గుణ‌పాఠం అయ్యింద‌ని విశ్లేషిస్తున్నారు. మారిన నేటి రోజుల్లో సినిమా కథను ఎంచుకోవడంలో చాలా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవ‌ల చిరు  సురక్షితమైన ఎంపిక‌ల కోసం రీమేక్ ల‌పై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. కానీ ఆచార్య ఒరిజిన‌ల్ స్టోరీతో తెర‌కెక్కిన‌ది. కానీ ఇది తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

కార‌ణం ఏదైనా కానీ ఆచార్య ప్ర‌భావం చిరు న‌టించే త‌దుప‌రి చిత్రాల‌పై స్ప‌ష్ఠంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. చిరు తదుపరి చిత్రం భోళా శంకర్ పై దాని ప్రభావం ఇప్పటికే ఉంది. ఆచార్యలో పాత చింత‌కాయ క‌థ‌ను తిప్పి తీయ‌డ‌మే ముప్పుగా మారింద‌ని ఇప్ప‌టికే విశ్లేషించారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు కట్టుబడి ఉండ‌డంతో వైవిధ్యాన్ని ఆశించే ప్రేక్ష‌కుడి మైండ్ కి ఆచార్య ఎక్క‌లేద‌ని అన‌లైజ్ చేసారు.

ఆచార్య రిజ‌ల్ట్ నిరాశ‌ప‌రిచాక‌.. ఆ సినిమా డైలాగ్ త‌ర‌హాలోనే గుణపాఠం నేర్చి ఇప్పుడు భోళా శంకర్ స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నార‌ని ఒక సెక్ష‌న్  లో గుస‌గుస వినిపిస్తోంది. భోళా శంకర్ అజిత్ న‌టించిన‌ వేదాళంకి అధికారిక రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
రీమేక్ అయినప్పటికీ ఫ్రేమ్-టు-ఫ్రేమ్ కాపీ కోసం వెళ్లకుండా అవసరమైన మెరుగుల‌ద్దేందుకు దర్శకుడు మెహ‌ర్ పై ఒత్తిడిని తెచ్చార‌ని స‌మాచారం.

అయితే మెగాస్టార్ చిరంజీవి కానీ ఇత‌ర హీరోలు కానీ మారిన ఆడియెన్ మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకోక‌పోయినా నెక్ట్స్ జెన్ యూత్ ని విస్మ‌రించినా దాని ఫ‌లితం కూడా అంతే తీవ్రంగా ఉంటుంద‌ని ఇప్ప‌టికైనా గ్ర‌హించి ప‌ని చేయాల‌ని కొంద‌రు విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ఎమోష‌న్స్ .. క‌మ‌ర్షియ‌ల్ అంశాల ఎంపిక ఎలా ఉన్నా క‌థ‌లో వైవిధ్యం కానీ కొత్త‌ద‌నం కానీ ఈరోజుల్లో సినిమాల విజ‌యాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

ఇంత‌కుముందు చూడ‌నిది ఇప్పుడే చూశామ‌ని కూడా ఆడియెన్ ఫీల‌వ్వాలి. లేదంటే తిప్పి కొడుతున్నారు. భోళాశంక‌ర్ తో పాటు మెగాస్టార్ న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రం వాల్టేర్ వీర‌న్న‌లోనూ కొత్త‌ద‌నం ఏం చూపిస్తార‌న్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది. వాల్టేర్ వీర‌న్న మెగాస్టార్ ఫ్యాన్స్ స్ఫూర్తితో తీస్తున్న ఒరిజిన‌ల్ కంటెంట్ మూవీ కావ‌డంతో దానిపై ఆస‌క్తి నెల‌కొంది.
Tags:    

Similar News