ఆ భాద్యత చిరు తీసుకున్నట్లేనా?

Update: 2019-09-11 01:30 GMT
ప్రస్తుతం టాలీవుడ్ కి దాసరి లేని లోటుని తీర్చే పనిలో నిమగ్నమయ్యాడు మెగా స్టార్ చిరు. ఆయన చేసే కార్యక్రమాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి కూడా. రెగ్యులర్ గా కొందరు సినీ ప్రముఖులను కలుస్తూ కొత్త టీంలను సపోర్ట్ చేస్తూ వారికి సన్మానాలు వంటివి చెయడం ఇవన్నీ మెగా స్టార్ ని దాసరి స్థానంలో నిలబెడుతున్నాయి.

నిజానికి ఏదైనా చిన్న సినిమా బాగా ఆడిన - పెద్ద సినిమాలు కలెక్షన్స్ రాబట్టినా దాసరి నుండి ఆ టీంకు ప్రత్యేక అభినందనలు అందేవి. అయితే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఇప్పుడు ఆ స్థానంలో తెలుగు సినిమా పెద్దగా చిరు అభినందనలు అందుతున్నాయి. ముందుగా పెద్ద మనసుతో 'శతమానం భవతి'  - 'మహానటి' యూనిట్లను పిలిచి మరీ సన్మానించిన చిరు ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే సినీ మహోత్సవం కి చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరు 'నిను వీడని నీడను నేనే' సినిమాకు సంబంధించి సందీప్ కిషన్ అండ్ టీమ్ ను అభినందించాడు.

నిజానికి ఇవే కాకుండా ఇండస్ట్రీకి సంబంధించి మరెన్నో వ్యవహారాల్లో పెద్దగా వ్యవహరిస్తున్నాడట మెగా స్టార్. పైగా 'సైరా' కూడా రిలీజ్ కి ఉండటంతో అడిగిన వారినల్లా కలుస్తూ వారితో కాసేపు మాట్లాడుతూ అన్నీ తెలుసుకుంటూ వస్తున్నారట. ఇవన్నీ చూసి ప్రస్తుతం అందరూ మెగా స్టార్ మెగా స్టారే అనిపించుకుంటున్నారు. సో ఈ విధంగా దాసరి స్తానం చిరు అందుకున్నట్లే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
   

Tags:    

Similar News