మెగా ఓల్డ్‌ మూమెంట్‌... పవన్ పై చిరు క్లాప్‌

Update: 2022-08-08 04:05 GMT
మెగా స్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో నెం.1 గా ఎదిగిన తీరు అందరికి తెలిసిందే. ఆయన తమ్ముడిగా ఈజీగానే ఎంట్రీ ని దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో అన్న ను మించిన తమ్ముడు అనిపించుకున్నాడు.

టాలీవుడ్ లో సీనియర్ స్టార్‌ హీరోల్లో మెగాస్టార్‌ చిరంజీవి నెం.1 అయితే.. యంగ్‌ హీరోల్లో పవన్‌ కళ్యాణ్ టాప్ స్టార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాంటి ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడెప్పుడు ఒకే ఫ్రేమ్‌ లో కనిపిస్తారా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. హీరోగా పవన్ కళ్యాణ్ కెరీర్ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను దక్కించుకున్న నేపథ్యంలో చాలా తక్కువ సమయంలోనే చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్‌ ను వదిలించుకున్నాడు.

ఇద్దరు అన్నదమ్ములు కలిస్తే అది ఒక అద్భుతం అన్నట్లుగా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వీరి కలయిక కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అందుకే అప్పుడప్పుడు అభిమానుల కోసం అయినా అన్నట్లుగా కలిసే వారు. అలా పవన్‌ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి హాజరు అయ్యారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. పవన్‌ కళ్యాణ్ మరియు ఇద్దరు హీరోయిన్స్ పై చిరంజీవి క్లాప్‌ కొడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మెగా ఫ్యాన్స్‌ ఈ పోటోను మెగా మూమెంట్‌ అంటూ తెగ షేర్‌ చేసుకుంటున్నారు.

పవన్‌ కళ్యాణ్ ఈ ఫోటోలో సింపుల్‌ అండ్ స్టైలిష్ లుక్ లో బాగున్నాడని.. అలాగే చిరంజీవి ని అలాగే చూడాలనిపించేలా ఉన్నాడంటూ మెగా ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. ఆ తర్వాత కూడా పవన్ చిరు లు చాలా సందర్భాల్లో కలిశారు. అయినా కూడా ఈ ఫోటో చాలా స్పెషల్‌ గా ఉందనే టాక్ వినిపిస్తుంది.
Tags:    

Similar News