63 వ‌య‌సులో మెగాస్టార్ సాహ‌సాలు

Update: 2019-05-05 14:30 GMT
ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగిన చ‌రిత్రకు చిరంజీవి తార్కాణంగా నిలుస్తార‌ని బాస్ అల్లు అర‌వింద్ ఎన్నో సార్లు వేదిక‌ల‌పై ప్ర‌స్థావించారు. మెగాస్టార్ హార్డ్ వ‌ర్క్ .. డెడికేష‌న్.. డౌన్ టు ఎర్త్ స్వ‌భావం త‌మ కాంపౌండ్ లో ప్ర‌తి ఒక్క‌రికి స్ఫూర్తి నింపుతుంద‌ని ప్ర‌స్థావిస్తుంటారు. 60 వ‌య‌సులోనూ చిరు డెడికేష‌న్ కి `ఖైదీనంబ‌ర్ 150` చిత్రంలోని సాంగ్స్ కి అత‌డు స్టెప్పులు వేసిన విధానం.. ఫైట్స్ లో ఈజ్ చూపించిన స్టైల్ ఎగ్జాంపుల్ అని ఉద‌హ‌రిస్తుంటారు. కెరీర్ 150వ సినిమా కోసం చిరు ఎంతో రిస్క్ చేశార‌ని రామ్ చ‌ర‌ణ్ సైతం తెలిపారు. ఇప్పుడు `సైరా` కోసం అంత‌కుమించిన రిస్కులు చేస్తూ మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు చిరంజీవి.

మెగాస్టార్ కెరీర్ లోనే ఛాలెంజింగ్ మూవీగా `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సురేంద‌ర్ రెడ్డి - రామ్ చ‌ర‌ణ్ బృందం ఈ సినిమా కోసం తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పోరాటాల చ‌రిత్ర‌కు త‌గ్గ‌ట్టు చిరు త‌న బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్న తీరు.. అలాగే ఫైట్స్ లో ఈజ్ చూపించిన తీరు గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వారియ‌ర్ స‌న్నివేశాల్లో మెగాస్టార్ ఎంతో అగ్రెస్సివ్ గా క‌నిపిస్తార‌ని ఆన్ లొకేష‌న్ చూసిన ఇత‌ర ఆర్టిస్టులు కితాబిస్తున్నారు. అలాగే బ్రిటీష్ వాళ్ల‌తో పోరాటాల నేప‌థ్యంలో సీన్స్ లో ఉగ్ర న‌ర‌సింహంలా ఉర‌క‌లు పెట్టిస్తాడ‌ని తెలుస్తోంది. ఇక ఛేజింగ్ స‌న్నివేశాల్లో.. గుర్ర‌పు స్వారీ చేయ‌డంలో చిరు స్టైల్ ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది.

సైరాలో కేవ‌లం బ‌య‌టికి చెప్పుకునేవే కాకుండా బ‌య‌ట‌కు క‌నిపించ‌ని ఎన్నో స‌స్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ముష్ఠి యుద్ధాలు.. క‌త్తి పోరాటాలు.. కోట‌లు- ప్రాకారాల‌పై జంప్ చేసే సీన్లు ఇవ‌న్నీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని చెబుతున్నారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని తెర‌కెక్కించేందుకు సురేంద‌ర్ రెడ్డి చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ఇందులో ఓ ఫిస్ట్ ఫైట్ (ముష్ఠి యుద్ధం) ఉంది. అది సినిమాకే హైలైట్ గా నిల‌వ‌బోతోంద‌ని చెబుతున్నారు. 63 వ‌య‌సులో చిరు ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా శ్ర‌మించిన తీరున‌కు స‌హ‌చ‌ర న‌టీన‌టులు అభినందిస్తున్నార‌ట‌. ఈ టీమ్ తో ఇప్ప‌టికే స్వీటీ శెట్టి అనుష్క జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. ఇందులో అమితాబ్ స‌హా స్టారాధిస్టార్లు న‌టించారు. దీంతో అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఈ సినిమా ద‌స‌రాకి వ‌స్తుందా.. రాదా? అన్న సందిగ్ధ‌త ఓవైపు క‌నిపిస్తోంది. ఇటీవ‌లే 99 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని.. మిగ‌తా ప్యాచ్ వ‌ర్క్ షూటింగ్ మాత్ర‌మే చేయాల్సి ఉంద‌ని వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అగ్నిప్ర‌మాదంలో సెట్స్ త‌గ‌ల‌బ‌డ‌డంతో మ‌రికాస్త షూటింగ్ ఆల‌స్య‌మ‌య్యేట్టే క‌నిపిస్తోంది. అటుపై భారీ గ్రాఫిక్స్ ని పూర్తి చేసుకుని వ‌చ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేసే వీలుంటుంద‌ని చెబుతున్నారు.
    

Tags:    

Similar News