మెగా బ్రదర్స్ కు దూరంగా సైరా

Update: 2019-03-21 05:05 GMT
ఒకపక్క తెలుగు రాష్ట్రాలు ఎన్నికల జ్వరంతో ఊగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ అనివార్యం కావడంతో టిడిపి వైఎస్ ఆర్ తో పాటు జనసేన ప్రచారం ఉదృతంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో బరిలో దిగడంతో పాటు ఎంపి అభ్యర్థిగా నాగబాబు పోటీ చేయనుండటం ఫ్యాన్స్ కి కొత్త జోష్ ఇస్తోంది. అయితే ఈ వ్యవహారాలకు మెగాస్టార్ చిరంజీవి పూర్తి దూరం కాబోతున్నారు. కారణం సైరా. కీలక దశ షూటింగ్ లో ఉన్న సైరా మరికొద్ది రోజుల్లో జపాన్ వెళ్లనుంది.

అక్కడ ఒక కీలక ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉంది. ఆర్టిస్టుల డేట్స్ ఇప్పటికి సెట్ కావడంతో గత ఏడాది పూర్తి చేయాల్సి ఈ షెడ్యూల్ ఇప్పటికి మార్చారు. సో పోలింగ్ తేది ఏప్రిల్ 11న చిరు ఇండియాలోనే ఉండరని టాక్. ఇది అనివార్యమని అలా కాకుండా వాయిదా వేసుకుంటే మళ్ళి కాల్ షీట్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉండటంతో ఫైనల్ గా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు

సో చిరు ఏ రకంగానూ జనసేనకు మద్దతు ఇవ్వడం కాని ప్రచారంలో పాల్గొనడం కాని జరగదనే క్లారిటీ వచ్చేసింది. మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఇద్దరే బాధ్యతలు మోయాలి. చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అనే స్పష్టత పార్టీకి సైతం లేదు. అందులో యాక్టివ్ గా ఉండటం ఎప్పుడో మానేసిన చిరు ధ్యాస సైరా మీద మాత్రమే ఉంది. దసరా విడుదల టార్గెట్ చేశారు కాబట్టి ఆలోపు మొత్తం పూర్తి చేయాలి అంటే చేతిలో ఉన్న తక్కువ టైంలో రాకెట్ స్పీడ్ తో పరుగులు పెట్టాలి. పైగా ప్రమోషన్ ఇంకా మొదలు పెట్టనేలేదు. ఈ నేపధ్యంలో అటు తమ్ముళ్ళ రాజకీయాలకు ఇటు పార్టీ వ్యవహారాలకు దూరంగా చిరు ఉండబోతున్నట్టు తెలిసింది
    

Tags:    

Similar News