మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడ తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఈ చిత్రం లో చూపించబోతున్నారు. ఆరు పదుల వయస్సు దాటిన చిరంజీవి ఈ చిత్రం కోసం యుద్ద సన్నివేశాల్లో పాల్గొనడంతో పాటు పలు సాహసవంతమైన యాక్షన్ సీన్స్ ను చేస్తున్నాడు. చిరంజీవి వయస్సు రీత్యా కాస్త మెల్లగా ఈ చిత్రం షూటింగ్ ను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం చిరంజీవి మరింత సాహసానికి సిద్దమవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాలోని ఒక యుద్ద సన్నివేశం అండర్ వాటర్ లో ఉంటుందట. అందుకోసం హాలీవుడ్ నుండి యాక్షణ్ టీం ను రప్పించి ఆ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వాటర్ లో యాక్షన్ సీన్స్ చాలా సహజంగా వచ్చేందుకు చిరంజీవి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందట. సినిమాలోని ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ కూడా బాగా రావాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి అందుకు సై అన్నట్లుగా తెలుస్తోంది.
యాక్షన్ సీన్స్ కోసం గత కొన్ని రోజులుగా చిరంజీవి హోమ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ఈ వయస్సు లో ఇంతగా కష్ట పడటం చిత్ర యూనిట్ సభ్యులందరు కూడా షాక్ అవుతున్నారు. ఆలస్యం అయినా పర్వాలేదు కాని సినిమాను ఎక్కడ రాజీ పడకుండా తీయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం వస్తుందని అంటున్నారు.