ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. మెగాస్టార్ చిరంజీవి రాకతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కొత్త శిఖరాల్ని అందుకుంటుందని అనుకుంటే.. ఉన్న స్థాయిలో కూడా నిలబడలేకపోయింది. బుల్లితెరపై చిరు మెప్పించలేకపోయాడు. ‘ఎంఈకే’ షోను అనుకున్నంత ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. ఆయనలో కాన్ఫిడెన్స్ తగ్గిపోయిన విషయం మధ్యలోనే స్పష్టంగా తెలిసిపోయింది. కొన్ని ఎపిసోడ్లలో చిరు అంత ఉత్సాహంగా కనిపించలేదు. ఐతే ఎలాగైతేనేం సీజన్లో ఫుల్ ఎపిసోడ్లను లాగించేశాడు చిరు. మొత్తానికి ఎంఈకే నాలుగో సీజన్ కు తెరపడిపోయింది. ఇక ఈ షో భవితవ్యం ఏంటి.. చిరు మళ్లీ ఈ షోలో కనిపిస్తాడా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లేదు.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ షో గురించి ప్రస్తావిస్తూ.. తర్వాత ఏంటో చెప్పలేను అనేశాడు చిరు. ఈ ప్రోగ్రాం రూపకర్తల మనసులో ఏముందో ఏంటో అంటూ సమాధానం దాటవేశాడు. చిరు హోస్ట్ చేసిన ఈ సీజన్లో షో టీఆర్పీ రేటింగులు దారుణంగా పడిపోయాయి. ఎంఈకే చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వచ్చిన ఈ రేటింగ్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ముందు రైజింగ్ లో ఉండి.. ఆ తర్వాత పడిపోవడం కాదు.. మొదట్నుంచి రేటింగ్స్ అలాగే ఉన్నాయి మరి. దీంతో చిరు ఎంఈకే అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయాడన్నది స్పష్టం. కనీసం ముందున్న తరహాలోనే రేటింగ్స్ ఉన్నా చిరు కంటిన్యూ అయ్యేవాడేమో. ఈ రేటింగ్స్.. సినిమా కమిట్మెంట్ల ప్రకారం చూస్తే చిరు తర్వాతి సీజన్లో కనిపించడం సందేహమే. మరి చిరు నో అంటే.. నాగ్ పునరాగమనం చేస్తాడా.. లేక కొత్త స్టార్ ఎవరైనా ఈ షోలో అడుగు పెడతాడా.. చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/