మెగాస్టార్ చిరంజీవి - 'కళాతపస్వి' కె.విశ్వనాథ్ మధ్య గురు శిష్యుల అనుబంధం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో ఒకరైన కె.విశ్వనాథ్.. చిరంజీవితో 'శుభలేఖ' 'ఆపద్భాంధవుడు' 'స్వయంకృషి' వంటి క్లాసిక్ సినిమాలు రూపొందించాడు. ఈ సినిమాలు అప్పటి వరకు మాస్ హీరోగా గుర్తింపు ఉన్న చిరంజీవిని క్లాస్ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. తన కెరీర్ లో మైలురాయి చిత్రాలను అందించిన కళాతపస్విని దీపావళి సందర్భంగా చిరంజీవి సతీసమేతంగా కలిసి ఆయన ఇంటికి చేరుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి చిరంజీవి - సురేఖ పాదాభిందనం చేశారు. చిరంజీవి - సురేఖ దంపతులు విశ్వనాథ్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు ముచ్చటించిన చిరు - విశ్వనాథ్ ఇద్దరు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సతీసమేతంగా తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ "విశ్వనాథ్ గారిని కలవాలనిపించి. ఈరోజు ఆయన ఇంటికి సురేఖతో కలిసి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు అందించారు. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది'' అన్నారు.