టాలీవుడ్ ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో మెగా ఫ్యామిలీ టాప్ లో ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా స్టార్ చిరంజీవి సెట్ చేసిన దారిలో ప్రస్తుతం కుర్ర హీరోలు ఎవరి స్టైల్ లో వారు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎవరి స్టామినాకు తగ్గట్టు వారు ఒక రేంజ్ మార్కెట్ ను కూడా సెట్ చేసుకున్నారు. అయితే ఈ మధ్య యువ హీరోల తీరు చిరంజీవికి ఏ మాత్రం నచ్చడం లేదట. కొన్ని సొంత నిర్ణయాల వల్ల ఆయన అప్సెట్ అవుతున్నారని టాక్ వస్తోంది.
అయితే చిరంజీవి కుర్ర హీరోలకు క్లాస్ కూడా ఇచ్చాడట. వారు ఎవరో కాదు. సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ అని తెలుస్తోంది. మెగా ఫ్యామిలిలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరు వారి సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేస్తుండడం చిరంజీవికి ఆగ్రహాన్ని తెప్పించిందట. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ విధంగా బాక్స్ ఆఫీస్ యుద్ధాలకు దిగితే.. ఒక సినిమా మరొక సినిమాపై ప్రభావం పడితే..మొదటికే మోసం వస్తుంది. మెగా ఫ్యామిలీ బ్రాండ్ పై కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా ఆ క్లాష్ తీసుకువస్తుంది.
అందుకే సాయి - వరుణ్ కి ఇటీవల మెగాస్టార్ గట్టిగా కౌంటర్ ఇచ్చే సరికి తప్పని పరిస్థితుల్లో డేట్ లో మార్పులు జరిగినట్లు సమాచారం. అయితే ఆ హీరోలకు కూడా ఈ క్లాష్ ఇష్టం లేదట. కాకపోతే ప్రొడ్యూసర్స్ తొందరపెట్టడం వల్ల ఆ డేట్ లో రాక తప్పడం లేదనే టాక్ కూడా టాలీవుడ్ లో నడుస్తోంది. మరి మెగా హీరోలు ఒక రోజు గ్యాప్ లో వస్తున్నప్పటికీ ఒక సినిమా ప్రభావం మరొక సినిమాపై ఉంటుందా లేదా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.