చిరు చెబితే అయిపోయినట్లే

Update: 2018-03-24 04:40 GMT
మెగాస్టార్ గా చిరంజీవికి తిరుగులేదనే విషయం ప్రూవ్ అయిపోయింది. అయితే.. రాజకీయపరంగా మాత్రం చిరు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం రాజ్యసభ మెంబర్ అయినా ఆయన పదవీకాలం ముగిసిపోతోంది. కానీ ఏపీ ప్రభుత్వంలో ఆయనకు మంచి లింకులే ఉన్నాయని.. తన పట్టు కంటిన్యూ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ ఓ సినిమా వేడుకను వైజాగ్ లో నిర్వహించారు. నిజానికి ఈ కార్యక్రమానికి మొదట పర్మిషన్ నిరాకరించిందట ఏపీ గవర్నమెంట్. ఎంతగానో ప్రయత్నించినా వర్కవుట్ కాలేదట. చివరకు అసలు వైజాగ్ లో కాకుండా హైద్రాబాద్ లోనే ముగించేద్దామా అని కూడా అనుకున్నారట. అలాంటి సమయంలో రంగంలోకి దిగిన చిరంజీవి.. ఇలా పావులు కదపడం.. తనకు సన్నిహితుడైన వ్యక్తితో మాట్లాడడం.. అలా పనులు జరిగిపోవడం.. చకచకా పర్మిషన్స్ వచ్చేయడం జరిగాయట. మొత్తం మీద చిరు సపోర్ట్ తో అలా ఆ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా ముగిసిపోయింది.

చిరంజీవికి ప్రభుత్వ విభాగాల్లో కూడా ఎంతటి పట్టు ఉందో చెప్పడానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు. విషయం ఏంటంటే.. వచ్చే నెల మొదటి వారంలో ఓ ఈవెంట్ ను వైజాగ్ లోనే ప్లాన్ చేశారట. ఆ సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది. తమ యాంగిల్ నుంచి ప్రయత్నాలు ముగిసిన తర్వాత.. వారు కూడా చిరంజీవినే ఓ మాట అడగాలని భావిస్తున్నారని టాక్.
Tags:    

Similar News