రెండో వారానికల్లా సినిమాల అడ్రస్ గల్లంతయిపోతున్న రోజులివి. ఐతే సంక్రాంతి సినిమాలకు ఆ తర్వాతి వారంలో పోటీ అన్నదే లేకపోవడం.. మూడో వారాంతంలో వచ్చిన మంచు విష్ణు సినిమా ‘లక్కున్నోడు’ నిలబడకపోవడంతో ఇప్పటికీ మంచి వసూళ్లే సాధిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ మూడో వారాంతంలోనూ ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. 16వ రోజుకు రూ.95.65 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం శనివారం నాడే ( 18వ రోజు) రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.92.5 కోట్లు తెస్తే ‘ఖైదీ నెంబర్ 150’ హిట్టుగా పరిగణించాలని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అంటే ఈ సినిమా ఆల్రెడీ హిట్ కేటగిరిలోకి వచ్చేసినట్లే. ఐతే వైజాగ్ లాంటి కొన్ని ఏరియాల్లో ఇప్పటికే మంచి లాభాలు రాగా.. నైజాంలో మాత్రం ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు పెర్ఫామ్ చేయలేదు.
16వ రోజుకు ఏరియాల వారీగా ‘ఖైదీ నెంబర్ 150’ షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం (తెలంగాణ)- రూ.18.50 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.14.05 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.11.98 కోట్లు
గుంటూరు-రూ.6.8 కోట్లు
కృష్ణా-రూ.5.32 కోట్లు
తూర్పు గోదావరి-రూ.7.65 కోట్లు
పశ్చిమ గోదావరి-రూ.5.70 కోట్లు
నెల్లూరు-రూ.3.15 కోట్లు
కర్ణాటక-రూ.8.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా-రూ.1.5 కోట్లు
ఓవర్సీస్-రూ.12.5 కోట్లు
మొత్తం-రూ.95.65 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
16వ రోజుకు ఏరియాల వారీగా ‘ఖైదీ నెంబర్ 150’ షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం (తెలంగాణ)- రూ.18.50 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.14.05 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.11.98 కోట్లు
గుంటూరు-రూ.6.8 కోట్లు
కృష్ణా-రూ.5.32 కోట్లు
తూర్పు గోదావరి-రూ.7.65 కోట్లు
పశ్చిమ గోదావరి-రూ.5.70 కోట్లు
నెల్లూరు-రూ.3.15 కోట్లు
కర్ణాటక-రూ.8.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా-రూ.1.5 కోట్లు
ఓవర్సీస్-రూ.12.5 కోట్లు
మొత్తం-రూ.95.65 కోట్లు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/