మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150.. సూపర్ స్పీడ్ లో కంప్లీట్ అయిపోతోంది. 'టైమ్ గ్యాప్ ఉంటుందేమో కానీ.. టైమింగ్ లో నో గ్యాప్' అని డైలాగ్ చెప్పిన రేంజ్ లోనే.. మొదలు పెట్టిన దగ్గర నుంచి చిన్న గ్యాప్ కూడా లేకుండా షూటింగ్ చేసేస్తున్నారు. ఇప్పటికే ఫైట్స్.. ఐటెం సాంగ్ వరకూ కూడా కంప్లీట్ అయిపోయాయి. హీరోయిన్ కాజల్ తో ఫారిన్ సాంగ్స్ కొన్ని బ్యాలెన్స్ ఉండడంతో పాటు.. క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది.
అయితే 2017 సంక్రాంతి రిలీజ్ కి షెడ్యూల్ చేసిన ఈ మూవీకి ఇప్పటికే చాలా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. ఈ లెక్కలన్నీ చూస్తే.. ఖైదీ టార్గెట్ కరెక్టుగానే సెట్ అయిందే అనిపించకమానదు. మొదటగా ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేసిన నిర్మాత రామ్ చరణ్ 13.5 కోట్లకు దీన్ని ఫైనలైజ్ చేశాడు. వైజాగ్ ఏరియాకు 7.7 కోట్లు.. గుంటూరు 6.3 కోట్లు.. ఈస్ట్ 5.7 కోట్లు.. వెస్ట్ 5 కోట్లు.. కృష్ణా 5 కోట్లు.. నెల్లూరు 3.2 కోట్లు బిజినెస్ జరిగిందని.. నైజాం-సీడెడ్ లు కూడా కలుపుకుని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారని అంటున్నారు. ఇది కాక ఇతర రాష్ట్రాల నుంచి మరో 20 కోట్లు రాబట్టాల్సి ఉంటుందట.
ఈ లెక్కన కేవలం థియేట్రికల్ రైట్స్ నే 80 కోట్లకు అమ్మితే.. ఖర్చులు అన్నీ కలుపుకుని 84 కోట్లైనా ఖైదీ నెంబర్ 150 రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఇది సేఫ్ వెంచర్ అవుతుంది. మెగా150పై ఉన్న బజ్ కారణంగా.. ఈ ఫిగర్ అంత పెద్దదేమీ కాదన్నది ట్రేడ్ వర్గాల మాట. అయితే.. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే అన్నది గుర్తుంచుకోవాల్సిన పాయింట్.
నిజానికి ఈ 84 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను దాటేసి.. ఖైదీ నెంబర్ 150 హిట్ అనిపించేసుకుంటే.. అప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల్లో 2వ స్థానంలో ఉన్న శ్రీమంతుడును దాటేసినట్లు అవుతుంది. అంటే నాన్ బాహుబలి రికార్డు చిరు ఖాతాలోకి వస్తుందన్న మాట. మెగాస్టార్ రీఎంట్రీ మూవీపై ఈ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ ఉండడంలో పెద్ద విషయమేమీ కాదులెండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/