2017 సంక్రాంతికి టాలీవుడ్ బాగా వేడెక్కనున్న విషయం ముందే తెలుసు. నాలుగు సినిమాలు సంక్రాంతి పందెంకోళ్లలా పోటీ పడతాయని ముందునుంచి అంచనాలున్నా.. ఇప్పుడు రెండు సినిమాలు ఈ పోటీ నుంచి తప్పుకుంటాయనే వార్తలున్నాయి. ఇక రేస్ లో మిగిలిన రెండు సినిమాలు కూడా పెద్దవే.. పైగా సీనియర్ స్టార్ హీరోలకు ల్యాండ్ మార్క్ చిత్రాలు. అందుకే పొంగల్ పోటీలోంచి తప్పుకోబోమని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150.. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణిలు.. పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో కూడా ఓ క్లారిటీ ఉంది. జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ కానుండగా.. జనవరి 13న ఖైదీ నెంబర్ 150 విడుదల చేస్తారని భావించారు. అయితే.. గౌతమిపుత్ర శాతకర్ణి ఖచ్చితంగా జనవరి 12నే వచ్చేటట్లయితే.. చిరంజీవి మూవీని రెండు రోజులు ప్రీపోన్ చేయనున్నారట. అంటే జనవరి11నే ఖైదీ నెంబర్ 150 థియేటర్లలోకి వచ్చేస్తుందన్న మాట. ఇలా ప్రీపోన్ చేయాలని భావించేందుకు రీజన్ ఏంటో ఎక్స్ పెక్ట్ చేయడం అంత కష్టమేమీ కాదు.
ప్రస్తుతం ఏ భారీ చిత్రానికైనా తొలిరోజు వసూళ్లు చాలా ముఖ్యం. ముందుగా రిలీజ్ అయ్యే చిత్రానికి.. ఆ ఒక్క రోజైనా ఎక్కువ స్క్రీన్స్ లో ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. అలా ఫస్ట్ డే రికార్డును సాధించేందుకు ఛాన్స్ ఉంటుంది. తర్వాత రిలీజ్ అయ్యే చిత్రం కూడా స్పెషల్ షోస్ వేసేందుకు ఛాన్స్ ఉన్నా.. రెగ్యులర్ షోస్ విషయంలో మాత్రం వెనకబడాల్సి ఉంటుంది. అందుకే.. జనవరి 12న శాతకర్ణిని ఖాయం చేస్తే.. 11నే ఖైదీని థియేటర్లలోకి తేవాలని చూస్తున్నారట దర్శకుడు వివి వినాయక్.. నిర్మాత రామ్ చరణ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/