సినీ ఇండస్ట్రీ సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలు - సినీ కార్మికుల కష్టాలు - నిర్మాతలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బందులు.. ఇలా అన్ని అంశాలను జగన్ కు వివరించినట్లు చిరు తెలిపారు. వీటి గురించి ఫిలిం ఛాంబర్ - కౌన్సిల్ - గిల్డ్ సభ్యులకు వివరిస్తానని.. మరోసారి సమావేశమై సీఎం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10న ముఖ్యమంత్రితో చిరు భేటీ కానున్నారని తెలుస్తోంది.
అయితే జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడానికి ముందు టాలీవుడ్ సినీ ప్రముఖులతో చిరంజీవి సమావేశం కాబోతున్నారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న చిరు.. సోమవారం ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారట. అయితే కొందరు కీలక సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో చిరంజీవి అధ్యక్షతన జరిగే సమావేశంలో.. పరిశ్రమలోని పెద్దలంతా పాల్గొననున్నారు. దీని కోసం మెగాస్టార్ స్వయంగా టాలీవుడ్ లోని పలువురికి ఫోన్ చేస్తున్నారట.
ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున - దిల్ రాజు - అల్లు అరవింద్ - సురేష్ బాబు - రాజమౌళి - కొరటాల శివ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - నిరంజన్ రెడ్డి - ఏసియన్ సునీల్ - యూవీ ప్రొడ్యూసర్ - సితార మరియు మైత్రీ నిర్మాతలు తదితరులంతా పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ - మహేష్ బాబు వంటి పలువురు హీరోలకు చిరంజీవి ఫోన్ చేసి ఆహ్వానించారని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియనప్పటికీ.. ఈ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాల్సిన అంశాల మీద చర్చించనున్నారని తెలుస్తోంది.
టికెట్ ధరల పెంపు - ఐదో షోకి అనుమతి - థియేటర్ల సమస్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలను ఏపీ సీఎంకు వివరించనున్నారు. ఇంతకుముందు చిరంజీవి ఒక్కరే జగన్ తో సమావేశం అవ్వగా.. అపాయింట్మెంట్ దొరికితే సినీ పెద్దలు ఈసారి కలిసి కట్టుగా ఒక బృందంగా వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా త్వరలోనే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇకపోతే హైకోర్టు సూచనలతో సినిమా టికెట్ రేట్ల మీద ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ చర్చలు జరుపుతోంది. ఇండస్ట్రీలో వివిధ విభాగాలకు చెందిన వారితో మూడు దఫాలుగా చర్చలు జరిపారు. హైకోర్టులో ఈ నెల 10న ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది. ఆలోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీ యోచిస్తోందని సమాచారం. ఈ క్రమంలో ఛాంబర్ ఆధ్వర్యంలో చిరంజీవి మీటింగ్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.