CM జగన్ తో నాగ్- చిరు టచ్ లో ఉన్నారా? ఈ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా చిరు సీఎంని కలవడం వెనక ఏం జరిగింది? తెలుసుకోవాలన్న ఆసక్తి పరిశ్రమలో కనిపించింది. టాలీవుడ్ సమస్యల్లో ఉన్నప్పుడు క్లిష్ట కాలంలో పరిష్కారం కోసం సినీపెద్దలు ఏం చేస్తున్నారో చూడాలన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో చిరంజీవి- నాగార్జున కలిసే దీనికోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారనడానికి తాజాగా కింగ్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
నిజానికి ఈరోజు చిరంజీవితో పాటు నాగార్జున కూడా తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీలో కనిపించాల్సింది.. కానీ నాగ్ కి వీలు పడలేదు. చిరుతో పాటు నాగార్జునకు ఆహ్వానం అందినా కానీ ఆయన వెళ్లలేకపోయారట. ప్రస్తుతం నాగ్ రిలీజ్ కి రెడీ అవుతున్న బంగార్రాజు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీపై నాగార్జున కీలకమైన హింట్ ఇచ్చారు. పరిశ్రమ తరపున మాట్లాడడానికే సీఎం జగన్ తో చిరంజీవీ సమావేశం అయ్యారని .. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను చిరంజీవి చర్చించుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంతా మంచే జరుగుతుందని నాగార్జున వ్యాఖ్యానించడం ఆసక్తికరం. నేటి భేటీలో చిరంజీవి టాలీవుడ్ ఎదుర్కొంటున్న కష్ట కాలం గురించి సమస్యల గురించి చర్చించారు. బేగం పేట నుంచి నేరుగా గన్నవరం ప్రత్యేక విమానంలో చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చిరు వెళ్లారు. అక్కడ ఆథిత్యం స్వీకరించిన అనంతరం సీఎంతో భేటీ అయ్యారు.