సైరా విషయంలో చిరు నో కాంప్రోమైజ్

Update: 2019-01-30 01:30 GMT
తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి కోసం నిర్మాత చరణ్ తో పాటు హీరో చిరంజీవి ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. రెండు వందల కోట్ల పెట్టుబడి కావడంతో వివిధ మార్గాల్లో హైప్ రావడమే కాక బాహుబలి రేంజ్ టాక్ వస్తేనే సేఫ్ అవుతుంది. అందుకే ఆలస్యం అవుతున్నా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా చెక్ చేసుకుని అవసరమైన చోట్ల రీ షూట్ కూడా చేస్తున్నారట.

ఇదిలా ఉంచితే పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమాకు ఓ టీమ్ లాంటి రైటర్స్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి మాధవ్ బుర్ర  డైలాగ్స్ స్క్రీన్ ప్లే లో సత్యానంద్ కన్నన్ లాంటి అనుభవజ్ఞులు కలిసికట్టుగా సైరా స్క్రిప్ట్ ను సిద్ధం చేసారు. వీళ్లందరితో కలిసి చిరు ఇటీవలే విడుదలైన మణికర్ణికను హోమ్ థియేటర్లో క్యూబ్ సిస్టం ద్వారా ప్రత్యేకంగా వీక్షించినట్టు సమాచారం. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. సైరా తరహాలోనే మణికర్ణిక కూడా వీరయోధురాలి కథ. కొన్ని సారూప్యతలు ఉన్నాయి.

అయితే దీని ఫలితం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశాజనకంగా ఉండటంతో దానికి కారణాలు ఏమై ఉంటాయా అని తన టీమ్ తో డిస్కస్ చేసేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసుకున్నారట. ఫెయిల్ అవ్వడానికి ఏఏ అంశాలు తోడ్పడ్డాయి ఎక్కడ క్రిష్ కంగనాలు తప్పు చేసారు అనే దాని గురించి విశ్లేషిస్తూ సైరాలో అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు చర్చలు జరిపారని వినికిడి. ఇదీ ఒకందుకు మంచిదే. ఆ లోపాలు ఏవో గుర్తిస్తె సైరాలో చక్కదిద్దుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎలాగూ కీలకమైన టాకీ పార్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. సో ఇప్పుడిలా మణికర్ణికను ఎనాలిసిస్ చేయడం మంచిదే. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం
Tags:    

Similar News