ఇతడేనంట.. చిరు చిన్న అల్లుడు

Update: 2016-02-17 12:28 GMT
ప్రముఖ నటుడు.. మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. చిరు చిన్న కుమార్తె శ్రీజ వివాహం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రేమ వివాహం చేసుకొని.. ఆపై విడిపోయి.. విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు తాజాగా పెళ్లికూతురు కావటం తెలిసిందే. చిరు ఇంట మోగుతున్న పెళ్లి బాజాల సంగతి బయటకు వచ్చినా.. ఇంతకీ చిరు చిన్న అల్లుడు ఎవరు? అతను ఎక్కడి వాడు? లాంటి ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానాలు దొరకని పరిస్థితి.

మొన్నటికి మొన్న చిరు ఇంట్లో పసుపు దంచిన కార్యక్రమం జరిగింది. తాజాగా చిరు అల్లుడికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. కుర్రాడి పేరు కల్యాణ్ అని.. అతడు ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ కుమారుడిగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార కుటుంబంగా తెలుస్తోంది.

కల్యాణ్ పేరిట అతని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది. చూసేందుకు స్టైలీష్ లుక్ లో ఉన్న కుర్రాడి ఫోటోలు చూసినోళ్లు.. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రావటం ఖాయమన్న మాటను చెప్పుకోవటం గమనార్హం.
Tags:    

Similar News