బుల్లి రామ్ చరణ్ వీర లెవెల్లో స్టెప్పులేయడం.. చిరంజీవి కొడుకుని ఎంకరేజ్ చేస్తూ వెనుకనుంచి అతణ్ని అనుకరించడం ఎప్పుడైనా చూశారా.. ఐదేళ్ల పాపగా ఉన్న శ్రీజను చిరు దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టడం ఎప్పుడైనా వీక్షించారా? అల్లు అర్జున్ చిన్న వయసులోనే మూన్ వాక్ చేయడం.. చెర్రీ..బన్నీలతో పాటు వరుణ్ తేజ్- సాయిధరమ్ తేజ్-అల్లు శిరీష్.. ఇలా మెగా ఫ్యామిలీకి చెందిన యువ కథానాయకులంతా చిన్న పిల్లలుగా ఉండగా తెగ అల్లరి చేస్తూ సందడి చేయడం ఎప్పుడైనా చూశారా? ఇలాంటి అరుదైన దృశ్యాలతో ఓ వీడియోను ప్రెజెంట్ చేసింది ఈటీవీ ప్లస్ ఛానెల్. ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులకు ఈ వీడియోను కానుకంగా అందించింది ఆ ఛానెల్. ప్రస్తుత మెగా యువ కథానాయకులందరూ చిన్న పిల్లలుగా ఉన్నపుడు తీసిన వీడియో ఇది. 90ల్లో చిరంజీవి యమ జోరుమీదున్న టైంలో ఇంట్లో పిల్లలతో కలిసి సరదాగా గడిపినపుడు ఈ వీడియో తీశారు. చిరు పిల్లల్లో ఒకడిగా మారిపోయి చేసిన సందడి ఈ వీడియోకు హైలైట్. మెగా అభిమానుల కడుపు నింపేసే వీడియోను వాళ్లందరూ చూసి తీరాల్సిందే.
వీడియో కోసం క్లిక్ చేయండి
వీడియో కోసం క్లిక్ చేయండి