ఓ సినిమాను మార్కెట్ చేసుకునేందుకు చాలానే టెక్నిక్స్ పాటించాలి. అందులో భాగమే.. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడం కూడా. ఇప్పటికే మెగాస్టార్ 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి మూవీని.. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేలా పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సైరాను చైనాకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట. అందుకు తగినట్లుగానే షూటింగ్ పనులు కూడా ప్లాన్ చేయడం విశేషం.
ఇతర దేశాలకు చెందిన భాషల నుంచి చైనాలో ఓ సినిమాను విడుదల చేయాలంటే.. ఖర్చులు ఎక్కువ పడతాయి. కానీ ఆ సినిమాలోని కొంత భాగాన్ని చైనాలో షూట్ చేస్తే.. ట్యాక్స్ రిబేట్స్ కూడా ఉంటాయి. అందుకే సైరా మూవీకి చెందిన ఓ షెడ్యూల్ ను చైనాలో చిత్రీకరించబోతున్నారట. మరికొన్ని రోజుల్లో అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఆయన షెడ్యూల్ తర్వాత.. పొల్లాచ్చిలో షూటింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ను మాత్రం పూర్తిగా చైనాకే కేటాయించారట.
చైనీయుల సినిమా టేస్ట్.. అక్కడ ఉండే వేల కొద్దీ థియేటర్లు.. ఈ మధ్య కాలంలో ఇండియన్ ముూవీస్ కి అక్కడ పెరుగుతున్న ఆదరణ.. ఇవన్నీ గమనించి.. సైరాను చైనాకు తీసుకెళ్లాలని డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను రాబట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు తప్పవు మరి.