మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ `సైరా - నరసింహారెడ్డి` చిత్రీకరణ మెజారిటీ పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇటీవలే కోకాపేట పరిసరాల్లోని చిరంజీవి ఫామ్ హౌస్ లో భారీ సెట్ అగ్ని ప్రమాదంలో ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆ సెట్ లో ఇంకాస్త షూటింగ్ పార్ట్ మిగిలి ఉందని కొణిదెల కాంపౌండ్ చెబుతోంది.
మరోవైపు అన్నపూర్ణ ఏడెకరాల్లో భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ సెట్ లో ఓ పాటను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అందుకోసం ఏడెకరాల్లో మొత్తం మూడు చోట్ల భారీ సెట్లు వేస్తున్నారు. పాత బిగ్ బాస్ సెట్ ను రీమోడల్ చేస్తున్నారు. దాదాపు 2కోట్ల మేర సెట్ నిర్మాణానికే ఖర్చవుతుందని తెలుస్తోంది. భారీగా ప్రధాన తారాగణంపై ఈ పాటను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే సెట్ వద్ద సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పర్యవేక్షణ సాగుతోంది. ఈ పాటను ఎలా చిత్రీకరించాలి? అన్నదానికి కొరియోగ్రాఫర్లతోనూ చర్చ సాగిస్తున్నారట. ఇక ఈ పాట సినిమాకే హైలైట్ గా ఉంటుంది. శంకర్ రేంజులో భారీతనంతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సెట్ ని చూస్తే.. ఇందులో చార్మినార్ నాలుగు స్థంబాలతో సెట్ వేశారు. అలాగే వేరొక చోట భారీగా పడవలతో సెట్ వేశారు.. ఈ డిజైన్లు పరిశీలిస్తే సైరాలో విజువల్ గ్రాండియారిటీతో హైలైట్ అయ్యే సాంగ్ ఇదని అర్థమవుతోంది. ప్రస్తుతం భారీగా కార్మికులు ఈ సెట్లను నిర్మిస్తున్నారు. మరో వారంలోనే చిత్రీకరణ సాగిస్తారని తెలుస్తోంది.
సైరా షూటింగ్ 99 శాతం పూర్తయిందని చెబుతున్నారు. మరోవైపు ప్యాచ్ వర్క్ సీన్లను పూర్తి చేయాల్సి ఉందిట. అలాగే బ్యాలెన్స్ సాంగ్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇది వరకూ ధగ్ధమైన సెట్ లోనూ కొంత పెండింగ్ షూట్ ఉందని సెట్ కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సెట్ లీక్డ్ ఫోటోలు అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి. సైరా దసరా కానుకగా రిలీజవుతుందా? అంటే ఇప్పటికైతే సస్పెన్స్. భారీగా విజువల్ గ్రాఫిక్స్ తో పని చేయాల్సి ఉంది కాబట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి బరిలో రిలీజయ్యే వీలుందని భావిస్తున్నారు. అయితే రిలీజ్ విషయమై కొణిదెల అధినేత రామ్ చరణ్ మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.