దసరాకు థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల జాబితాలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన తాజా మూవీ పెళ్లి సందD. దాదాపు పాతికేళ్ల క్రితం ఇదే పేరుతో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రానికి దర్శకత్వం వహించటం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ఆ సినిమాలో హీరోగా చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా మళ్లీ నటించటం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రిరిలీజ్ ఫంక్షన్ ను తాజాగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి.. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తన సినిమా గురించి మాట్లాడే సందర్భంగా యువ హీరో రోషన్.. చిరంజీవిని ఉద్దేశించి.. ‘మెగాస్టార్ చిరంజీవిగారు’ అని సంబోధించాడు. రోషన్ తనను అలా పిలవటాన్ని చిరంజీవి ఇష్టపడలేదు. రోషన్ ప్రసంగమయ్యాక.. తాను మాట్లాడే సందర్భంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు చిరంజీవి.
‘ఏం రోషన్ నన్నే చిరంజీవిగారు అని పేరు పెట్టి పిలుస్తావా? ఏమ్మా ఉమ (శ్రీకాంత్ సతీమణి.. రోషన్ తల్లి) ఇదేనా నీ కొడుక్కి నేర్పించావు? అంటూ చిరు కోపంతో మాట్లాడి నవ్వేశారు. అక్కడితో ఆగని చిరంజీవి.. ‘నేను మీ నాన్నకు అన్నయ్యను. నీకు పెద్దనాన్నను అవుతాను. నువ్వు అలాగే పిలువు. అలా పిలిస్తే చాలా ఆప్యాయంగా అనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. చిరు మాటలు అందరిని ఆకట్టుకోవటమే కాదు.. ఆయన చిరు కోపం అందరిని అలరించింది. చిరంజీవి తన చిరు కోపాన్ని ప్రదర్శిస్తున్న వేళ.. రోషన్ కలుగజేసుకొని.. ఇప్పటికే దెబ్బలు పడిపోయాయి అంటూ వ్యాఖ్యానించటం అక్కడ నవ్వులు విరబూశాయి.