22 ఆగస్ట్.. మెగాస్టార్ చిరంజీవి 66వ బర్త్ డేని పురస్కరించుకుని 100 రోజుల ముందే సీడీపీతో వేడుకలను ప్రారంభించారు మెగా ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా మెగాభిమానులు ఈ వేడుకలను ప్రతియేటా సామాజిక కార్యక్రమాలతో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా సెంటిమెంట్ గా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలతో బర్త్ డే వేడుకలను ప్రారంభించారు. సేవా కార్యక్రమాలను ఘనంగా కొనసాగిస్తున్నారు. నేడు 99వ రోజు .. ఈ ఆదివారం నాడు మెగా బర్త్ డే వేడుకలను జరుపుకోనున్నారు.
ఈసారి బర్త్ డేకి మునుపెన్నడూ లేనంత ప్రత్యేకత ఉంది. మెగాస్టార్ 66వ ఏట అడుగుపెడుతున్నా.. ఇంకా 26 ఏళ్ల యువకుడిలా బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే నలుగురు దర్శకులతో బాస్ సినిమాలు చేస్తున్నారు. రేపటి బర్త్ డేని పురస్కరించుకుని రోజు ముందే మెహర్ రమేష్ ప్రాజెక్ట్ కి సంబంధించిన యూరోఫియా రిలీజ్ చేస్తున్నాం! అంటూ ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇంతలోనే బాబి మరో డైనమిక్ 3డి మోషన్ విజువల్ తో మనసు దోచాడు.
3డి మెగా బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్ ని బాబి ట్విట్టర్ వేదికగా లాంచ్ చేశారు. ఎంపరర్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్.. ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటూ అతడు ఎంతో ఉత్సాహంగా ట్వీట్ లో సెలబ్రేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. దీనిని ఎప్.ఐ.ఐ.పి స్టూడియోస్- రైజింగ్ హ్యాండ్స్ సంయుక్తంగా డిజైన్ చేయడం విశేషం. ఒక సామాన్య యువకుడు ఇంతింతై అన్న చందంగా పెద్ద స్టార్ అయిన వైనాన్ని ఈ యానిమేటెడ్ మోషన్ పోస్టర్ లో ఆవిష్కరించారు. పునాదిరాళ్లు చిత్రంతో కెరీర్ ని ప్రారంభించిన చిరంజీవి టాలీవుడ్ లో ఒక్కో అడుగు వేస్తూ మార్గమధ్యంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ముళ్ల దారిలో వెళ్లినా చివరికి ఆశించిన కుర్చీని అధిరోహించి బాస్ అయ్యారన్న థీమ్ ని ఇందులో ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
అభిమాని కథతోనే మెగా బాస్ సినిమా..!
మెగాస్టార్ చిరంజీవి .. బాబి నడుమ రిలేషన్ షిప్ ఎలాంటిది? అంటే ఒక హీరో- డైరెక్టర్ అనుబంధం కానే కాదు. తొలుత బాబి మెగాస్టార్ వీరాభిమాని. ఒక ఫ్యాన్ గా మెగాభిమాన సంఘాల్లో పని చేసి ఇప్పుడు బాస్ తో సినిమా చేసే స్థాయికి ఎదిగారు. ఈ సినిమా కథకు స్ఫూర్తి మెగాస్టార్ అని బాబి అన్నారు. ఆయన స్టార్ డమ్ ని ఆదర్శంగా తీసుకునే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రివీల్ చేసారు. మెగాస్టార్- ఆయన అభిమాని మధ్య ఉండే ఎమోషనలో బాండింగ్ ఈ కథకు మూలం అని పేర్కొన్నారు. ఓ సాధారణ మెగా అభిమాని ఎలా ఉంటాడు? ఆ అభిమాని పట్ల ఓ స్టార్ ఎలా ఫీల్ అవుతారు? అన్న అంశాన్ని సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమా అదే స్థాయిలో కమర్శియల్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్టు ఇది.
మెగాస్టార్ క్లాసిక్ హిట్స్ `గ్యాంగ్ లీడర్`..`ఘరానా మొగుడు`.. `రౌడీ అల్లుడు` స్ఫూర్తితో రాసుకున్న కథాంశమిదని తెలిసింది. సినిమా మాస్ లో అదే స్థాయిలో దూసుకుపోతుందని బాబి ధీమా వ్యక్తం చేసారు. ఈ స్క్రిప్టు కోసం దాదాపు రెండు సంవత్సరాలు పైగా పని చేసినట్లు బాబి వెల్లడించారు. మెగాస్టార్ పై అభిమానంతో ఓ ఫ్యాన్ గా రాసుకున్న అద్భుతమైన.. అందమైన కథ అని అన్నారు. కథ..కథనాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయని ...మెగా అభిమానులు ఎంత మాత్రం నిరాశపడకుండా ఈ సినిమా ప్రారంభం నుంచి చివరిదాకా సాగుతుందని అన్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా బాలీవుడ్ నటి.. ముకుపుడకల సుందరి సోనాక్షి సిన్హాని బరిలో దించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.
బాబి తర్వాత ఛాన్స్ ఎవరికి?
మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ లో నటిస్తారు. బ్యాక్ టు బ్యాక్ నలుగురు దర్శకుల్ని ఆయన ఫైనల్ చేసి స్క్రిప్టు పనిలో ఉన్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలోని సినిమా అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్నాయి. అలాగే యువదర్శకుడు సుజీత్ కి.. వీవీ వినాయక్ కి అవకాశం ఉంది. అలాగే పూరి జగన్నాథ్ సహా పలువురు దర్శకులు చిరుతో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మునుముందు కథాచర్చలు జరిగే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Happy to launch the 3D MEGA Birthday Common Motion Poster of Emperor of Entertainment, the One and Only MEGA STAR ⭐ @KChiruTweets garu!#MegaCommonMotionPoster ✅
Design by @fiipstudios