మెగాస్టార్ చిరంజీవి-నటసింహా నందమూరి బాలకృష్ణ మధ్య మళ్లీ బిగ్ ఫైట్ తప్పదా? ఇద్దరు హీరోలు ఢీ అంటే ఢీ అనేస్తున్నారా? ఈసారి బాక్సాఫీస్ పోరుకు సంసిద్ధమవుతున్నారా? నాటి పోరుకి మళ్లీ ఇరువురు కాలు దువ్వుతున్నారా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి- బాలకృష్ణ 80లు.. 90 లలో పోటాపోటీగా సినిమాలు చేసేవారు. వీరిద్దరు దాదాపు మూడు దశాబ్ధాల పాటు పోటీ పడ్డారు. సంక్రాంతి పందెంలో చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ పోరు ఓ రేంజులో సాగేది. ప్రతిసారీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సై అనేవారు. ఆ తర్వాతి కాలంలోనే కొన్నాళ్ల పాటు ఆ జోరు కొనసాగింది. అయితే పొలిటికల్ ఎంట్రీ అనేది ఆ ఇద్దరి మధ్యా పోరుకు చెక్ పెట్టింది.
ముఖ్యంగా మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత అలాంటి సన్నివేశం కనిపించలేదు. బాలకృష్ణ సమకాలీకులైన నాగార్జున- వెంకటేష్ సినిమాలు పోటీలో ఉన్నా బాక్సాఫీస్ వద్ద ఆ వేడి కనిపంచేది కాదు. అయితే బాస్ మళ్లీ కంబ్యాక్ అవ్వడంతో పాత రోజులను తలపించడం ఖాయమనే టాక్ మళ్లీ ఊపందుకుంది.
ప్రస్తుతం బాలయ్య-చిరంజీవి కమిట్ అవుతున్న సినిమాలను పరిశీలిస్తే.. ఈ రకమైన విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వంలో `ఆచార్య`లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు వరుసగా మూడు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అందులో రెండు రీమేక్ లు ఉన్నాయి. మలయాళం రీమేక్ `లూసీఫర్` .. తమిళ్ సినిమా `వేదాళం` రీమేక్ లోనూ చిరంజీవి నటిస్తున్నారు. రీమేక్ దర్శకులు సర్వం సిద్దం చేసుకుని రెడీగా ఉన్నారు. అలాగే బాబి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయనున్నారు. ఇలా ఈ మూడు ప్రాజెక్ట్ లు పట్టాలెక్కడానికి రెడీగా ఉన్నాయి.
ఇక బాలయ్య రెట్టించిన స్పీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం మాస్ డైరైరెక్టర్ బోయపాటి తో `అఖండ` సినిమా చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఆ తర్వాత గోపీ చంద్ మలినేని తో మరో మాస్ ఎంటర్ లో నటించనున్నారు. అటుపై అనీల్ రావిపూడితోనూ బాలయ్య ఒక సినిమా చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్ట్ లు బాలయ్య లాక్ చేసి పెట్టారు. ఇక డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో రెండవ సినిమా చేయాలని బాలయ్య వెయిట్ చేస్తున్నారు. `పైసా వసూల్` తర్వాత ఈ కాంబినేషన్ మరో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏ క్షణమైనా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇవి గనుక అనుకున్న సమయంలో పట్టాలెక్కితే చిరు వర్సెస్ బాలయ్య బాక్సాఫీస్ పోరు తప్పదనే సంకేతాలు బలంగానే కనిపిస్తున్నాయి.
ఎందుకంటే మెగాస్టార్ కంబ్యాక్ ఫిల్మ్ `ఖైదీ నంబర్ 150`కి పోటీగా బాలయ్య నటించిన `గౌతమిపుత్రశాతకర్ణి`ని రిలీజ్ చేసారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి. 2017లో సంక్రాంతి బరిలో ఈ పోటీ వేడెక్కించింది. ప్రస్తుతం ఇద్దరూ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ బాలయ్య- చిరు మళ్లీ బాక్సాఫీస్ పోరులోకి ఎందుకు రారు?.. ఏదో ఒక సందర్భం అలా యాథృచ్ఛికంగా అయినా కలిసొస్తుందని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. సంక్రాంతి లేదా దసరా పోరుకు సమ్మర్ రేసింగ్ కి ఆ ఇద్దరూ సిద్ధమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. 90లలో రసవత్తర పోటీని మరోసారి తేవడం ద్వారా బాక్సాఫీస్ వద్ద హల్ చల్ మరో రేంజుకు చేరుతుందని కూడా ఆశిస్తున్నారు.