పుష్ప‌కి ఆచార్యుని విషెస్ దీవెన‌లే!

Update: 2021-12-16 07:31 GMT
మావ‌య్య స్ఫూర్తితోనే సినిమాల్లోకి వ‌చ్చి అగ్ర హీరోగా రియ‌ల్ ఛాలెంజ‌ర్ గా ఎదిగాడు అల్లు అర్జున్. మెగాస్టార్ ప్రోద్భ‌లం ప్రోత్సాహంతోనే తాను ఇంత‌టివాడిన‌య్యాన‌ని బ‌న్ని విన‌మ్రంగా అంగీక‌రిస్తాడు. చ‌ర‌ణ్ ని కూడా అంతే ప్రేమిస్తాడు. కానీ కెరీర్ ప‌రంగా మెగా వ‌ర్సెస్ అల్లు కాంపిటీష‌న్ గురించి తెలిసిందే. ఇది వారి ఎదుగుద‌ల‌కు ఉప‌క‌రిస్తున్న ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ అని చెప్పాలి. ఇటీవ‌ల బ‌న్ని.. చ‌ర‌ణ్ ఒకరితో ఒక‌రు పోటీప‌డుతూ పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అలాగే రిలీజ్ తేదీలు థియేట‌ర్ల స‌ర్ధుబాటు వంటి అంశాలు ఒక్కోసారి ఇరు వ‌ర్గాల‌కు ఇబ్బందిక‌ర‌మే. మెగా సినిమా వ‌చ్చేప్పుడే అల్లు సినిమా వ‌స్తోంది అంటే మెగా ఫ్యాన్స్ మ‌ధ్య డివైడ్ ఫ్యాక్ట‌ర్ ప‌ని చేస్తుంటుంది. దానివ‌ల్ల ఇరువురికీ న‌ష్ట‌మే. ఇటీవ‌ల ఆచార్య .. పుష్ప చిత్రాలను ఒకే తేదీకి రిలీజ్ చేస్తార‌ని ప్ర‌చార‌మైంది. రిలీజ్ తేదీ వ‌ల్ల క్లాష్ త‌ప్ప‌ద‌ని భావించారు. కానీ అనూహ్యంగా చిరంజీవి- ఆచార్య రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. బ‌న్ని న‌టించిన పుష్ప డిసెంబ‌ర్ 17న య‌థావిథిగా ముందే ప్ర‌క‌టించిన‌ట్టే విడుద‌లైపోతోంది.  చిరు- ఆచార్య వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ పోస్ట్ పోన్ అయ్యింది.

తాజాగా పుష్ప టీమ్ కి మెగా బాస్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. చిరు ట్విట్టర్ లో అల్లు అర్జున్- రష్మిక- సుకుమార్ ల‌తో పాటు పుష్ప టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ``మీరందరూ మీ రక్తం.. చెమటను ధార‌పోసి హృద‌యంతో ప‌ని చేసి ఆత్మ‌ను ఈ చిత్రంలో ఉంచారు! మీ ప్రయత్నానికి హృదయపూర్వకంగా ప్రశంస‌లు.. విజ‌యంతో పేరు రావాల‌ని నేను కోరుకుంటున్నాను!`` అని చిరు ట్వీట్ చేశారు.

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. సినిమా కోసం క‌ష్ట‌పడుతున్న ఆర్టిస్టులు టెక్నీషియన్ల కృషిని మెచ్చుకునే గొప్ప ప‌ర్స‌నాలిటీ మెగాస్టార్ చిరంజీవి. నేటిత‌రం హీరోలు ఎద‌గాల‌ని ఆయ‌న ఆకాంక్షిస్తూ వారికి విషెస్ చెబుతుంటారు. ఇక ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ఇంత‌గా ఎదిగేయ‌డం పైనా ఆయ‌న సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోనై ఆనందం వ్య‌క్తం చేస్తుంటారు. బ‌న్ని హీరో కాక ముందే చిరు న‌టించిన‌ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ లో ఓ సాంగ్ బిట్ తో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాక త‌న‌ని తాను హీరోగా ఆవిష్క‌రించుకునేందుకు బ‌న్ని ఎంత‌గానో శ్ర‌మించారు. ఇప్పుడు పరిశ్ర‌మ అగ్ర హీరోగా త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకుని ఇత‌రుల‌తో పోటీప‌డుతున్నారు.
Tags:    

Similar News