పెట్టికోట్ తో ఉన్నానని చెప్పినా వినలేదు

Update: 2016-06-15 17:30 GMT
గత 2-3 రోజులుగా బాలీవుడ్ లో ఓ హాట్ న్యూస్ ఏంటంటే.. చిత్రాంగద సింగ్ లాంటి యాక్ట్రెస్.. ఓ సీన్ లో నటించేందుకు ఇబ్బంది పడుతున్నా అంటూ.. సెట్స్ నుంచి వెళ్లిపోవడమే. అసభ్యంగా నటించమన్నందుకే వెళ్లిపోయానని హీరోయిన్ చెబుతుంటే.. యాక్టింగ్ చేతకాక పారిపోయిందని దర్శక నిర్మాలు వెర్షన్ వినిపించారు. దీంతో ఒళ్లు మండిన చిత్రాంగద సెట్స్ లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు వివరించేసింది.

బాబూమోషాయ్ బందూక్ బాజ్ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీతో ఓ క్లోజ్ షాట్ చేయాల్సి ఉందట. కేవలం ఒంటిపై పెట్టికోట్ వేసుకుని... నవాజుద్దీన్ పై బోర్లా పడుకుని ఓ సీన్ చేసిందట. అయితే.. సీన్ బాగారాలేదంటూ మళ్లీ చేయమని డైరెక్టర్ కిషాన్ చెప్పడంతో.. 'కేవలం పెట్టికోట్ తో ఉన్నాను ఇబ్బందిని అర్ధం చేసుకోమని వివరించినా అతను వాదిస్తూనే ఉన్నాడు. ఈలోగా నిర్మాత కిరణ్ శ్యామ్ జోక్యం చేసుకుని.. హీరోను గాఢంగా ముద్దు పెట్టుకోవాలని చెప్పాడు. మీలో డైరెక్టర్ ఎవరంటూ నేను అరిచాను' అని చెప్పింది చిత్రాంగద.

అసభ్యకరమైన సన్నివేశాన్ని పదేపదే షూట్ చేయాలని అనుకోవడమే కాకుండా.. తాను సరిగా నటించలేదని అబద్ధం చెబుుతున్నారంటూ మండిపడ్డ చిత్రాంగత.. ఇక ఆ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయబోనని తేల్చేసింది.
Tags:    

Similar News