శతమానం సక్సెస్ మీట్ కి చిరు??

Update: 2017-01-27 07:46 GMT
ఈ సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నంబర్ 150.. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలతో.. పోటీగా రిలీజ్ అయింది శతమానం భవతి. అయినా సరే చక్కని ఫ్యామిలీ కంటెంట్ తో అందరినీ ఆకట్టుకుని.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 9 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. ఫుల్ రన్ లో 30 కోట్లు వసూలు చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

శతమానం భవతి గ్రాండ్ సక్సెస్ ను పురస్కరించుకుని.. ఇవాళ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశాడు నిర్మాత దిల్ రాజు. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్.. దర్శకుడు సతీష్ వేగేశ్నతోపాటు.. మొత్తం శతమానం టీం హాజరవుతున్నారు. అయితే.. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు నిర్మాత. దిల్ రాజు నుంచి ఆహ్వానం అందుకున్న చిరు.. తప్పినసరిగా హాజరవుతానని మాటిచ్చేశారు. చెప్పినట్లే వచ్చేస్తున్నారట కూడా.

తన ల్యాండ్ మార్క్ అండ్ కం బ్యాక్ మూవీకి పోటాపోటీగా వచ్చినా సరే.. కుర్ర హీరో సినిమా సక్సెస్ మీట్ కి హాజరవుతూ.. చిరు తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. చిరు సపోర్ట్ కూడా అందుతుండడంతో.. మరికొన్ని వారాల పాటు శతమానం భవతి సత్తా చాటనుందని.. ముఖ్యంగా ఈ వీకెండ్ లో భారీగా లాభపడనుందని అంటున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News