ఇండియాలో భాగం అయిన కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించి ఆ రాష్ట్రంకు ప్రత్యేక జెండా.. రాజ్యాంగం.. ప్రత్యేక హోదా కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షాలపై పూలు - రాళ్లు రెండూ పడుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు కొన్ని పార్టీలు ఆర్టికల్ 370ని రద్దు చేయడంను వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ కు చెందిన ప్రజలు సైతం రద్దును వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ సమయంలో మన సినీ తారలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం.
బాలీవుడ్.. టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల నుండి సినీ ప్రముఖులు ఈ విషయమై స్పందిస్తున్నారు. దాదాపు అందరు సినీ ప్రముఖులు కూడా ఆర్టికల్ 370 రద్దుపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు తమ ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు తీసుకున్న నిర్ణయంను అభినందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ ఈ విషయమై స్పందిస్తూ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్న మోడీ మరియు అమిత్ షాలకు హ్యాటాఫ్. దేశ భక్తి కలిగిన ప్రతి భారతీయుడి తరపున థ్యాంక్స్. యునైటెడ్ ఇండియా కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప నివాళి.
అనుపమ్ కేర్ స్పందిస్తూ.. కాశ్మీర్ గురించి నా జీవితంలో విన్న ఒక గొప్ప న్యూస్ ఇది. ఒక కాశ్మీరి అబ్బాయికి ఇంతకంటే గొప్ప న్యూస్ ఏమీ ఉండదు. ఆ దేవుడికి.. మోడీ మరియు అమిత్ షాలకు కృతజ్ఞతలు. ఇదే రోజున నా బయోపిక్ విడుదల అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది.
దర్శకుడు మెహర్ రమేష్ స్పందిస్తూ... ఇకపై కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం ఉండదు. ద్వంద పౌరసత్వం ఉండే అవకాశమే లేదు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఎస్ కే ఎన్ మరియు లావణ్య త్రిపాఠి కూడా ఈ విషయమై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.