నిర్మాణం బంద్ పెట్టాలా? లేదా? అన్న‌ది తేలేది రేపే!

Update: 2022-07-22 08:11 GMT
టాలీవుడ్ ఇండ‌స్ర్టీ పీక‌ల్లోతూ క‌ష్టాల్లో కూరుకుపోతున్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ర్టీని ప‌ట్టి పీడిస్తున్న ఎన్నో స‌మ‌స్య‌ల‌కు పుల్ స్టాప్ పెట్టాల‌ని నిర్మాత‌ల మండలి సంక‌ల్పించి  సినిమా  తాత్కాలిక నిర్మాణానికి రంగం సిద్దం చేస్తుంది.

ఆగ‌స్టు 1 నుంచి  నిర్మాణం బంద్ పెట్టే ఆలోచ‌న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. హీరోల పారితోషికాల విష‌యంలో దిగ‌తొచ్చే వ‌ర‌కూ ఎట్టిప‌రిస్థితుల్లో నిర్మాణం చేప‌ట్టేది లేద‌ని కొంత మంది నిర్మాత‌లు భీష్మించుకుని కూర్చున్నారు.

ఈసారి తాడో..పేడో తేల్చుకునే దిశ‌గానే కొంత‌మంది నిర్మాత‌లు  బ‌లంగా ముందుకు క‌దులుతున్నారు. అలాగే ఓటీటీతో ఎదుర‌వుతోన్న ఇబ్బందులు..టిక్కెట్ ధ‌ర‌ల స‌మ‌స్య‌లు..కంటెంట్ ప్రాధాన్య‌త ఇలా కొన్ని అంశాలు ప్ర‌ధాన ఎజెండ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ స‌మ‌స్య‌ల సాధ‌న దిశ‌గా నిర్మాత మ‌డ‌లి అధ్య‌క్షుడు సి. క‌ళ్యాణ్ ఎలాంటి ఆలోచ‌న‌తో ముందుకు వెళ్తున్నారు? అంటే  కొంత మంది నిర్మాత‌ల వాద‌న‌కి  ప్ర‌తిగానే క‌నిపిస్తుంది.  ఓసారి ఆయ‌న మాట‌లు ప‌రిశీస్తే..

``కొత్త సినిమాల నిర్మాణం ఆపాల‌న్న‌ది త‌మ ఉద్దేశం కాద‌ని..  ప్ర‌ధానంగా కంటెంట్...టిక్కెట్ ధ‌ర‌లు..ఓటీటీ వేదిక వంటి వాటి ప్ర‌భావంపైనే ప్ర‌ధానంగా నిన్న‌టి భేటీలో చ‌ర్చించాం. ఒక‌వేళ షూటింగ్ లు బంద్ చేయాల్సిన ప‌రిస్థితులు వ‌స్తే కొత్త ప్రాజెక్ట్ ల్నే నిలిపివేయాలా?  లేక ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న వాటినే ఆపేయాలా? అన్న కోణంలో చ‌ర్చించామ‌ని.. ఏ నిర్ణ‌య‌మైనా చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లితో క‌లిసే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని  క‌ళ్యాణ్ తెలిపారు.

ఈనెల 23న చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి ఆధ్యర్యంలో జరిగే స‌మావేశం త‌ర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌ని  కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సినిమాల బంద్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు? అన్న‌ది శ‌నివారం జ‌రిగే స‌మావేశంతో పూర్తి  క్లారిటీ వ‌స్తుంద‌ని  తెలుస్తుంది.

ఇప్ప‌టికే నిర్మాత దిల్ రాజు స‌హా కొంత మంది పెద్ద‌లు హీరోల‌తో పారితోషికాల విష‌యంలో  సంప్ర‌దింపులు..చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. వాళ్ల నుంచి సానుకూల‌మైస‌న దృక్ఫ‌ధ‌మే వ్యక్త‌మ‌వుతున్న‌ట్లు  తెలుస్తోంది. మ‌రి  అంత‌మింగా ఎవ‌రెవ‌రు? ఎలాంటి నిర్ణ‌యాల‌తో  మ‌ళ్లీ మీడియా ముందుకొస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది
Tags:    

Similar News