`భారతీయుడు 2` వివాదం సమసిపోక ముందే శంకర్ తో రామ్ చరణ్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రకరకాల వివాదాలతో నిలిచిపోయిన భారతీయుడు 2 పై సరైన స్పష్ఠత లేదు. లైకా సంస్థతో శంకర్ సమస్య ఎన్నటికీ పరిష్కృతం కానిదిగా కనిపిస్తోంది. అయినా దిల్ రాజు బృందం చరణ్-శంకర్ తో సినిమాకి పనులు ప్రారంభించేయడం ఆశ్చర్యపరిచింది. అయితే భారతీయుడు 2 పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా చేయకూడదనేది లైకా కండీషన్. ఆ మేరకు తెలుగు ఫిలింఛాంబర్ కి కూడా లేఖను పంపారు.
అయితే ఈ సమస్య పరిష్కారమయ్యేదెపుడు? శంకర్ ఇండియన్ 2 చిత్రీకరణ పూర్తి చేసి వస్తారా? అంటే.. క్లారిటీ రాలేదు. రాం చరణ్ తో శంకర్ పాన్-ఇండియన్ ప్రాజెక్టుపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్ట్ జూలై నుండి సెట్స్ కి వెళ్లాలన్నది ప్లాన్. అయితే చరణ్ మాత్రం ఇండియన్ 2 వివాదంపై పూర్తి క్లారిటీ రావాలని భావిస్తున్నారట. రామ్ చరణ్ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నిర్మాత దిల్ రాజును పిలిచి తమ చిత్రం గురించి శంకర్ నుండి వివరణ తీసుకోమని కోరారట. రామ్ చరణ్ తన ప్రాజెక్ట్ చేపట్టే ముందు శంకర్ ఇండియన్ 2 కి సంబంధించిన అన్ని చట్టపరమైన సమస్యలను క్లియర్ చేయాలని కోరుతున్నారు. శంకర్ చిత్రంలో ఆలస్యం జరిగితే మరో సినిమా తీయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నారు.
మెగాపవర్ స్టార్ ఇప్పటికే రెండేళ్ళకు పైగా ఆర్.ఆర్.ఆర్ కోసమే కేటాయించారు. ఇక ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సంతకం చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. వివాదం సమసిపోయి శంకర్ ఇండియన్ 2 చిత్రీకరణ కోసం వెళితే రామ్ చరణ్ ఆ తీరిక సమయాన్ని వృధా చేయడు. శంకర్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే ముందు అతను మరో సినిమా చేస్తారు. కేవలం నిరీక్షణ 3 నెలల కన్నా తక్కువ ఉంటే శంకర్ రాక కోసం చరణ్ వేచి చూసే అవకాశం ఉంటుంది. దీనిపై దిల్ రాజు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రామ్ చరణ్ కు త్వరలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
మరోవైపు లైకాతో శంకర్ సమస్యను పరిష్కరించి భారతీయుడు 2ని త్వరగా పూర్తి చేయాలని కమల్ హాసన్ కూడా సన్నాహకాల్లో ఉన్నారని ఆయన లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నారని కూడా ఇంతకుముందు కథనాలొచ్చాయి. దీనిపై రెండు వారాల్లోగా క్లారిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు. నిజానికి భారతీయుడు- 2 చిత్రం 2021-22 సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. ఆ తర్వాత చరణ్ -శంకర్ మూవీ కూడా అంతకుమించి మోస్ట్ అవైటెడ్ మూవీగా చర్చల్లోకొస్తుందనడంలో సందేహమేం లేదు.