బాలీవుడ్ సూపర్ స్టార్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తో కలిసి ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పఠాన్ అనే సినిమాను చేసిన షారుఖ్ ఖాన్ ఆ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఇదే సమయంలో అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాను ఇటీవలే మొదలు పెట్టారు. చాలా కాలంగా వీరిద్దరి కాంబోలో సినిమా గురించిన వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కింది అనుకుంటూ ఉండగా టైటిల్ కూడా రివీల్ అయ్యింది. షారుఖ్ ఖాన్ తో అట్లీ తీస్తున్న సినిమాకు 'లయన్' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే లయన్ టైటిల్ ను కొందరు నమ్మలేదు. కాని జాతీయ మీడియా ప్రూప్స్ తో పాటు నిరూపించే ప్రయత్నం చేసింది.
పూణెలో షూటింగ్ కోసం స్థానిక అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అనుమతుల కోసం షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ వారు ఒక దరకాస్తును పెట్టారు. అందులో సినిమా టైటిల్ ను లయన్ గా పేర్కొన్నారు. సాదారణంగా అయితే ప్రొడక్షన్ నెం. అని రాస్తారు. కాని టైటిల్ ను రాయడంతో ముందుగానే టైటిల్ ను అనుకున్నట్లుగా తెలుస్తోంది. లయన్ టైటిల్ ను భారీ ఎత్తున హైప్ పెంచి ఆ తర్వత రివీల్ చేయాలనుకున్నారు. కాని అనూహ్యంగా చిన్న పొరపాటు వల్ల రివీల్ అవ్వడం విచారం అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే టైటిల్ ను మార్చే యోచనలో కూడా ఉన్నారని అంటున్నారు. లయన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను షారుఖ్ ఖాన్ మూవీకి పెట్టడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా షారుఖ్ కు చాలా కాలంగా తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని అట్లీకి షారుఖ్ సూచించాడని తెలుస్తోంది.
ఈమద్య కాలంలో స్టార్ హీరోలు తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నారు. అందుకే షారుఖ్ కూడా ఏడాదికి ఇకపై రెండూ ముడు సినిమాలు అయినా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే పఠాన్ ఉండగానే మరో వైపు ఈ సినిమాను కూడా పట్టాలెక్కించాడు. మరో వైపు షారుఖ్ తో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కూడా సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. అది వచ్చే ఏడాది మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి షారుఖ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు. జీరో సినిమా ప్లాప్ వల్ల మూడు ఏళ్ల పాటు షారుఖ్ సినిమాను చేయకుండా ఖాళీగా ఉన్నాడు. మొదలు పెట్టిన షారుఖ్ మళ్లీ ఆగకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూనే ఉన్నాడు.