మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోతోంది. ఈ నెల 10వ తేదీన.. అంటే మరో నాలుగు రోజుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ కావాల్సి ఉండగా.. సడెన్ గా డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వివాదం తలెత్తింది.
ఏషియన్ సినిమాస్ కు చెందిన సునీల్ నారంగ్ తో ఒక్కడు మిగిలాడు మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన ఒప్పందాలను గతంలోనే చేసుకున్నారు దర్శక నిర్మాతలు. దీని ప్రకారం.. నైజాంలో 50 థియేటర్లను ఈ చిత్రం కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ సిట్యుయేషన్ బాగానే ఉంది కానీ.. సడెన్ గా సునీల్ నారంగ్ తన మైండ్ సెట్ మార్చుకోవడం వివాదానికి కారణం అయింది. 10వ తేదీన రిలీజ్ అయితే.. తాను కేవలం 5 థియేటర్లను మాత్రమే నైజాంలో ఇవ్వగలనని.. ఎక్కువ థియేటర్లు కావాలంటే మూవీని పోస్ట్ పోన్ చేసుకోవాలని సూచించాడట ఈ డిస్ట్రిబ్యూటర్. దీనిపై మాట్లాడేందుకు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ కు ఒక్కడు మిగిలాడు దర్శక నిర్మాతలు వెళ్లగా.. అక్కడ మాటా మాటా పెరిగిందని.. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారని తెలుస్తోంది.
సునీల్ నారంగ్ ముందు జాగ్రత్తగానే పోలీసులను అప్రోచ్ కాగా.. ఈ దర్శక నిర్మాతల విషయంలో కూడా పోలీసులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. అయితే., ప్రస్తుతం పరిస్థితులు సెట్ అయ్యాయని.. చర్చలకు ఇరు వర్గాలు సుముఖంగానే ఉన్నాయని టాక్. కొన్ని గంటల్లోనే ఈ వివాదానికి తెరపడొచ్చని అంటున్నారు.