టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా దాదాపు 40 ఏళ్ల పాటు కొనసాగుతున్న ఆలీ ఇటీవల రాజకీయ అంశాలతో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితంగా ఉన్న అతను ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పార్టీ తరఫున ప్రచారాలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ పై రివర్స్ కామెంట్స్ చేయడం కూడా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆలీ పాలిటిక్స్ లో మాత్రం బిజీ కావాలి అని అనుకుంటున్నట్లు అర్థం అవుతుంది. ఇక అతని సపోర్ట్ ను గుర్తించిన వైఎస్ జగన్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా బాధ్యతలు అప్పగించ్చారు. ఇక ఆ బాధ్యతను త్వరలోనే తాను తీసుకోబోతున్నట్లు కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ తెలియజేశాడు.
మొన్నటి వరకు తన కూతురు పెళ్లి హడావిడిలో బిజీగా ఉండడం వలన ఆ బాధ్యతలను తీసుకోవడానికి కొంత ఆలస్యం అయింది అని చెప్పుకొచ్చాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్నలకు కూడా ఆలీ సమాధానం అయితే ఇచ్చాడు.
నేను చేసిన వర్క్ ను చూసి ఇప్పుడు నాకు ఒక బాధ్యతను అప్పగించారు. అది నాకు చాలా సంతోషంగానే ఉంది.
ఇక ఇప్పుడు నేను పార్టీకి ఉపయోగపడే విధంగా నా పనిని కొనసాగించాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత వారు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా కూడా నేను సిద్ధమే అని పూర్తిస్థాయిలో పార్టీ మాటకు కట్టుబడి ఉంటాను అని ఆలీ వివరణ ఇచ్చాడు.
అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండే విధానంపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తాను అని తెలియజేశాడు. మరి వచ్చే ఎన్నికల్లో ఆలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.