మిగతా సినీపరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ లోనే కమెడియన్లు ఎక్కువ. ఎంత మంది వున్నా వారికి తగ్గ అవకాశాలు భారీ స్థాయిలోనే వుండేవి. ఇటీవలీ కాలంలో తమదైన హాస్యంతో అలరించిన కమెడియన్ లు చాలా మంది ఆనారోగ్య కారణాలతో కాలం చేశారు. ఉన్న వాళ్లలో సునీల్.. శ్రీనివాస రెడ్డి లాంటి కమెడియన్లు కంబ్యాక్ కాలేకపోతున్నారు. సునీల్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చినా ఆ స్థాయిలో కనెక్ట్ కాలేకపోతున్నాడు. అతని స్థాయిలో ఆకట్టుకోగల కమెడియన్ ల కొరత ఇప్పడు టాలీవుడ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. కమెడియన్లు హీరోలు అయిపోతుంటే ఆ గ్యాప్ అలానే ఉండిపోతోంది. అయితే సునీల్ స్థాయిలో ఆకట్టుకోగల హాస్యనటులు వేరే ఎవరూ లేరా అంటే ఒక కమెడియన్ గురించి చెప్పుకోవాలి.
యంగ్ టాలెంటెడ్ కమెడియన్ సత్య ఇటీవల స్థిరంగా రాణిస్తున్నాడు. కమెడియన్ గా మంచి పేరుంది. సునీల్ లాంటి పర్సనాలిటీ ఉంది.. ఆ స్థాయిలో హాస్యాన్ని పండించగల టాలెంట్ వున్నా సత్య మాత్రం ఇంకా ఎందుకనో జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లలేకపోతున్నాడు. అలా దూసుకెళ్లే ప్రయత్నం చేయలేదా... అతనికి తగ్గ అవకాశాలు రాకనా? అన్నది అతడు విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.
మెయిన్ స్ట్రీమ్ కమెడియన్లలో వెన్నెల కిషోర్ తరహాలో వేరొక కమెడియన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గ్యాప్ ని ఫిల్ చేసే సత్తా సత్యకు ఉంది. కానీ ఎందుకనో రేసులో దూసుకురాలేకపోతున్నాడనే అభిమానులు భావిస్తున్నారు. సునీల్ కు త్రివిక్రమ్ లా సత్యకు కానీ సత్య లాంటి కమెడియన్లకు కానీ ఎవరూ అంత మంచి స్నేహితుడు దొరక్కపోవడం కూడా ఓ కారణమా? ఇప్పటికైనా యంగ్ డైరెక్ట ర్లు.. స్టార్ డైరెక్టర్లు యువ కమెడియన్లలో టాలెంట్ ని అవకాశాలిస్తారని ఆశిద్దాం. ఇక హాస్య నటులు దర్శకులతో మెయింటెయిన్ చేసే ర్యాపోని బట్టి కూడా అవకాశాల రేంజ్ మారిపోతుంటుంది. ఈ విషయంలో నవతరం కమెడియన్లు ఫెయిలవుతున్నారా? ఒక్క సత్య విషయంలోనే కాకుండా ఇతర కమెడియన్లు కూడా విశ్లేషించుకోవాల్సిన పాయింట్ ఇది. ఒకప్పుడు జంధ్యాల- ఈవీవీ-త్రివిక్రమ్-సత్తిబాబు లాంటి కామెడీలు వండే డైరెక్టర్లు ప్రత్యేకించి తమ ఆస్థానంలో కొందరు ఆస్థాన కమెడియన్లకు స్థిరంగా అవకాశాలివ్వడం వల్లనే వాళ్లు ఆ స్థాయిని అందుకోగలిగారు.