శంకరాభరణం కామెడీలో ఇదే హైలైట్

Update: 2015-12-05 17:30 GMT
కామెడీకి కేరాఫ్ అడ్రస్, ట్యాలెంట్ కి నిలువెత్తు నిర్వచనం తానే అంటూ.. రైటర్ కోన వెంకట్ తెగ చెప్పారు కాని.. లాజిక్‌ లేకుండా శంకరాభరణం లో ఆయన యాడ్‌ చేసిన పాయింట్లు మాత్రం కాస్త తేడా కొట్టేశాయ్‌. అది ఏ రేంజులో అంటే.. ఏకంగా జనాలు సినిమాను నానా విధాలుగా విశ్లేషిస్తూ.. బీభత్సమైన కామెడీ చేసేస్తున్నారు. రిలీజ్‌ రోజునే నెగెటివ్‌ టాక్‌ రావడానికి ఇదే కారణం.

ఓ లాజిక్కూ గట్రా ఏం లేకుండా, ఒరిజినల్ ని పాడు చేసేసి, అందులో ఫీల్ ని చంపేసి చెత్త ఏరుకొచ్చేసి తీసేసిన శంకరాభరణం ఫేట్.. ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. సినిమాలోని అతి పెద్ద కామెడీ విషయానికొస్తే.. ఈ సినిమా నేటివిటీ ప్రకారం స్టోరీ అంతా బిహార్ లోనే సాగుతుంది. అందుకు తగ్గట్లుగానే కేరక్టర్లకి హాపీ ఠాకూర్, రజ్జో ఠాకూర్ అంటూ పేర్లు పెట్టాడు. కానీ హీరో సొంతం చేసుకోవాలని అనుకునే ఇంటికి మాత్రం.. ఏ మాత్రం ఆలోచించకుండానే శంకరాభరణం అంటూ తెలుగు పదాన్ని ఎలా పేరు పెట్టాడన్నది అర్ధం కాని విషయం.
Tags:    

Similar News