కామెంట్: నువ్వు మారాలి కాజల్!!

Update: 2016-10-28 09:30 GMT
గత రాత్రి సెక్సిణి కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లో జరిగిన 'ఎంతవరకు ఈ ప్రేమ' సినిమా ఆడియో లాంచ్ కు విచ్చేసిన సంగతి ఆల్రెడీ తెలిసిందే. కెరియర్ ఖతమ్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఇలా అమ్మడికి ఒక యంగ్ హీరో తమిళంలో ఆఫర్ ఇవ్వడంతో.. ఆ సినిమాను తెలుగులో కూడా ప్రమోట్ చేస్తోంది చందమామ. బాగానే ఉంది.

అయితే స్టయిలింగ్ విషయంలోమాత్రం కాజల్ ఇంకా తన కాంపిటీటర్లు అయిన సమంత - రకుల్ ప్రీత్ - తాప్సీ వంటి భామలను టచ్ చేయలేకపోతోంది. పోనివ్ వారి రేంజులో అదరగొట్టేయకపోయినా కూడా.. మినిమం బాగుండాలిగా. అబ్బే అలా కూడా. కావాలంటే రాత్రి అమ్మడి లుక్ ఎలా ఉందో మీరే ఓసారి గమనించండి. డార్క్ లిప్ స్టిక్.. డిప్పలాగా సెంటర్ పాపడి.. పైగా ఆ కాస్ట్యూమ్.. వామ్మో దారుణంగా ఉంది కాజల్ లుక్. ఆ చెప్పులూ ఆ బట్టలూ అన్నీ పాత కాలానివే. పోనివ్ పూర్తి స్థాయి రెట్రో లుక్ లో వస్తుంది అంటే అదీ కాదు.. మధ్యలో ఏంటో హ్యాలోవీన్ టచ్ ఇస్తుంటుంది. ఆ స్టయిలింగ్ ఘోరాతి ఘోరంగా ఉంది.

మనం చూసుకుంటే అప్పట్లో అమ్మడు ఫిలింఫేర్ అవార్డుల్లో భారీ క్లీవేజ్ షో చూపించి కవ్వించింది కాని.. అసలు స్టయిల్ పరంగా ఒక్క మార్కు కూడా పడలేదు. అందుకే బాలీవుడ్ లో కూడా ఈమె గురించి ఒక్క మాటలను కూడా ఒక్క ఫ్యాషన్ బ్లాగులో కూడా రాయట్లేదు. నువ్వు మారాలి కాజల్. ఇంకొంత కాలం కెరియర్ ఎక్సటెండ్ అవ్వాలంటే మాత్రం.. స్టయిల్ స్టేట్మెంట్ గట్టిగానే ఇవ్వాలి. ఇలా ఘోరంగా వస్తే మాత్రం కష్టమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News