వాళ్లతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ : దుల్కర్‌

Update: 2022-08-03 08:30 GMT
మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయిన హీరో దుల్కర్‌ సల్మాన్‌. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ తనయుడు అయిన దుల్కర్‌ సల్మాన్‌ ఈ వారం ప్రేక్షకుల ముందుకు సీతారామం సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన ఈ తెలుగు సినిమా తో పాన్ ఇండియా రేంజ్‌ లో దుల్కర్ సల్మాన్‌ ఈ వారం సందడి చేయబోతున్నాడు.

పాన్ ఇండియా అనే పదం పెద్దగా నచ్చని దుల్కర్ సల్మాన్‌ తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్‌ స్టార్స్‌ గతంలోనే దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్నారు. వారి సినిమాలు చాలా వరకు అన్ని భాషల్లో డబ్బింగ్‌ అయ్యి ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు ఎందుకు పాన్ ఇండియా సినిమాలు అంటే నొక్కి చెప్పడం అంటూ దుల్కర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మంచి సినిమా అంటే సరిపోతుందని.. పాన్ ఇండియా సినిమా అనాల్సిన అవసరం లేదు అనేది తన అభిప్రాయం అన్నాడు. ఇక కెరీర్ ఆరంభించి పదేళ్లు అయ్యింది.. ఈ పదేళ్లలో దుల్కర్ 35 సినిమాలు చేశాడు. సాధారణంగా అయితే ఈ నెంబర్ చాలా పెద్దది అని చెప్పాలి.

మన స్టార్‌ హీరోలు కెరీర్‌ ఆరంభించి రెండు మూడు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇరవై ముప్పై సినిమాలు మాత్రమే చేశారు.. చేస్తున్నారు. కాని దుల్కర్‌ మన వాళ్లతో పోల్చితే చాలా బెటర్‌. కాని దుల్కర్‌ మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ పదేళ్లలో 35 సినిమాలు చేయడం అనేది గొప్ప విషయం గా తాను భావించడం లేదు అన్నట్లుగా  చెప్పుకొచ్చాడు.

మలయాళ ఇండస్ట్రీలో నా తోటి హీరోలు ఏడాదికి 10 నుండి 12 సినిమాలు చేస్తున్నాను. మా నాన్న గారు అప్పట్లో ఏడాదికి ముప్పై కి పైగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్లతో పోల్చితే నేను చేసింది చాలా తక్కువే కదా అంటూ దుల్కర్‌ సల్మాన్‌ తన సింప్లిసిటీని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు.

తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతగా అభిమానిస్తున్నారని అనుకోలేదు. మహానటి సమయంలో కాళ్లకు దెబ్బ ఉండటం వల్ల ప్రమోషన్ కు హాజరు అవ్వలేక పోయాను. ఆ సమయంలో తెలుగు ప్రేక్షకుల అభిమానం ను తెలుసుకోలేకపోయాను. సీతారామం సినిమా ప్రమోషన్ కోసం తిరుగుతుంటూ తెలుగు వారి అభిమానం కు ఆశ్చర్యం.. సంతోషంగా ఉందని దుల్కర్‌ పేర్కొన్నాడు.
Tags:    

Similar News