నానికి తక్కువా? ఎందుకీ కంపారిజన్?

Update: 2018-06-07 01:30 GMT
హీరోల్లో ఎవరి రేంజ్ వారికి ఉంటుంది. ఒకరిని ఇంకొకరితో వారి పారితోషికంను అనుసరించి కంపేర్ చేయడం భలే కామెడీగా ఉంటుంది. పోనీ ఒకే రేంజ్ హీరోలను కంపేర్ చేస్తే.. ఆసక్తిగా ఉండొచ్చేమో కానీ.. టాలీవుడ్ టాప్ హీరోను మీడియం రేంజ్ హీరోతో అది కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎలా పోల్చగలుగుతారు?

గతేడాది బిగ్ బాస్ షో చేసినందుకు గాను.. తనకు బాగానే గిట్టుబాటు అయిందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పాడు. ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు 50 లక్షలు ముట్టచెప్పారని టాక్. ఇప్పుడు ఏడాది మారింది.. హోస్ట్ మారాడు. ఎన్టీఆర్ ప్లేస్ లో నాని వచ్చాడు. న్యాచురల్ స్టార్ కు ఒక్కో ఎపిసోడ్ కు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఎన్టీఆర్ కంటే నాని ఇన్ని రెట్లు తక్కువ అంటూ కొంతమంది పోలికలు పెడుతున్నారు. ఎన్టీఆర్ కు ఇచ్చిన మొత్తం నానికి ఎందుకు ఇస్తారు.. అంతే మొత్తం ఇచ్చేట్లయితే ఎన్టీఆర్ రేంజ్ హీరోనే ట్రై చేసుకుంటారు కదా. ఈ సింపుల్ పాయింట్ ను కూడా ఈ విమర్శకులు మరిచిపోతున్నారు.

ఓ కార్యక్రమంపై ఇద్దరు హీరోలను కంపేర్ చేయడం అంటే.. వారు ఆ షోను ఎలా రన్ చేస్తున్నారు.. సిట్యుయేషన్స్ ఎలా డీల్ చేయగలిగారు అన్న దగ్గర పోలిస్తే అంతో ఇంతో బాగుంటుంది. అయినా.. ఎవరు ఎంత తీసుకుంటే మనకెందుకు బాసూ.. వారు తీసుకునే కోట్లలో ఎవరికీ వాటా రాసివ్వరు కదా.. ఆడియన్స్ ను ఎంతవరకు ఎంగేజ్ చేయగలిగారు అనేంత వరకు లిమిట్స్ లో కంటెంట్ రాసుకుంటే.. ఆసక్తిగా ఉండడమే కాదు.. ఎబ్బెట్టుగా అనిపించడం మానేస్తుంది. ఏమంటారు?
Tags:    

Similar News