బాహుబలి రికార్డులు తిరగరాస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సందర్భం లో ఇటు అభిమానుల్లో, అటు కామన్ జనాల్లో బోలెడన్ని సందేహాలు. మళ్లీ ఈ రికార్డును తిరగరాసే సినిమా వస్తుందా? తెలుగు లో అలాంటిది తీయగలరా? మహేష్ శ్రీమంతుడు ఈ రికార్డుల్ని కొట్టేస్తుందా? పవన్ గబ్బర్ సింగ్ 2 సృష్టి కి ప్రతి సృష్టి చేస్తుందా? అంటూ రకరకాల ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. అయితే ఇదంతా వినేవాళ్ల కు టూమచ్ అనిపిస్తోంది.
వాస్తవానికి శ్రీమంతుడు, గబ్బర్ సింగ్-2 చిత్రాలకు బాహుబలి తో పోలికేంటో? ఆ సినిమాల జోనర్ వేరు. బాహుబలి జోనర్ వేరే. అలాంటప్పుడు పోలిక ఎలా కుదురుతుంది? అలాగే బాహుబలి బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అంతా ఓ ఎత్తు. అందుకు ధీటుగా అంతటి అత్యున్నత సాంకేతికతను వినియోగించే వేరొక సినిమాని వేరొక హీరో తో తెరకెక్కించినప్పుడు పోలిక చెప్పొచ్చు. త్వర లో శంకర్ 'రోబో 2' తీయబోతున్నాడు. ఆ సినిమాకి భారీ సాంకేతికతను ఉపయోగిస్తాడు.. కాబట్టి అలాంటి సినిమా తో పోలిస్తే తప్పేం కాదు. బాహుబలి రికార్డుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకంటే భారీ బడ్జెట్ తో రికార్డులు తిరగరాసే సినిమాని శంకర్ తీయనూ వచ్చు.
పోల్చేటప్పుడు సమఉజ్జీని వెతకాలి. సముచితంగా ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికి ఈ పోలికలు చెప్పడం టైమ్ వేస్ట్. ఓవర్సీస్ లో మహేష్ సినిమాకి ఫుల్‌రన్ లో 2మిలియన్ డాలర్లు సంపాదించే సత్తా ఉంది. అసలు హీరోయిజం తో, హీరో తో పనే లేకుండా బాహుబలి 6.5 మిలియన్ డాలర్లు 10రోజుల్లో వసూలు చేసింది. అంటే ఇది జోనర్, కాన్వాసును బట్టి కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకానీ ఇలాంటి అసంబద్ధమైన పోలికలు పరమ వృధా.. కాదంటారా?