భూత్ బంగ‌ళా ద‌ర్శ‌కుడిపై కేసు బుక్‌

Update: 2018-02-01 05:49 GMT
వివాదాల్ని నెత్తిన వేసుకునే తీరు ఈ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. మాట్లాడే మాటల్ని ఆచితూచి మాట్లాడే విష‌యంలో నియంత్ర‌ణ కోల్పోతున్న ప్ర‌ముఖులు క‌ష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. గ‌తంతో పోలిస్తే.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం పెర‌గ‌టంతో పాటు.. మ‌నోభావాల విష‌యంలోనూ చాలా క‌చ్ఛితంగా ఉంటున్నారు. ఎవ‌రు ఎవ‌రిని ఏ సంద‌ర్భంలో ఎలా అన్నా.. ఆ అన్న మాట‌ల్లో చిన్న‌పాటి తేడాను కూడా సహించ‌లేక‌పోతున్నారు. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన చ‌ర్య‌ల కోసం డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడూ అలాంటి పరిస్థితే నెల‌కొంది. భూత్ బంగ‌ళా సినిమా ద‌ర్శ‌కుడు అజ‌య్ కౌండిన్య ఈ మధ్య‌న మాట్లాడిన సంద‌ర్భంగా మ‌హిళ‌ల మ‌నోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై ఒక ఛాన‌ల్ నిర్వ‌హించిన డిబేట్ లో తాను గ‌తంలో చేసిన వాద‌న‌ను స‌మ‌ర్థించుకోవ‌ట‌మే కాదు.. తాను అన్న మాట‌ల్ని నిరూపిస్తామ‌ని స‌వాలు విసిరారు.

ఇంత‌కీ భూత్ బంగ‌ళా ద‌ర్శ‌కుడి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఏమిట‌న్న‌ది చూస్తే.. అమీర్ పేట‌లోని విద్యార్థులు.. కొంద‌రు పోలీస్ బాస్ లు వ్య‌భిచారులేన‌ని చెప్ప‌టాన్ని మ‌ల్కాజ్ గిరి వ‌సంత‌పురి కాల‌నీకి చెందిన శ్రీ‌ల‌లితా మ‌హిళా మండ‌లి స‌మితి అధ్య‌క్షురాలు జిన్నెల సురేఖ తీవ్రంగా త‌ప్పు పెట్టారు.

జూబ్లీహిల్స్ స్టేష‌న్లో తాజాగా ఫిర్యాదు చేసిన ఆమె.. ద‌ర్శ‌కుడు అజ‌య్ తీరు ఏ మాత్రం స‌రిగా లేద‌ని.. మ‌హిళ‌ల మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా ఉంద‌ని పేర్కొన్నారు. అత‌డిపై కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేశారు.  ఈ నేప‌థ్యంలో జిన్నెల సురేఖ ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు.. ద‌ర్శ‌కుడు అజ‌య్ పై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు.
Tags:    

Similar News